నిన్న వనపర్తిలో కన్నవనపర్తి  కొడుకు ముందే తండ్రిని కిందపడేసి కానిస్టేబుల్ చితకబాదిన వీడియో మనమందరం చూసాము. కొడుకు ప్లీజ్ అంకుల్ అంటున్నా కూడా వినకుండా ఆ కానిస్టేబుల్ ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా అధికార మదంతో విర్రవీగుతూ ఆ సదరు వ్యక్తిపై దాడి చేసాడు. 

ఈ వీడియో వైరల్ గా మరి కేటీఆర్ దాకా వెళ్లడంతో ఆయన సోషల్ మీడియాలోనే హోమ్ మంత్రిని, డీజీపీ ని ఇల్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, పోలీసులు చేస్తున్న మంచి పనులన్నీ, ఇలాంటి ఒకటి రెండు సంఘటనల వల్ల మంటగలిసిపోతుందని ఆయన అన్నారు. 

కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన వనపర్తి ఎస్పీ అపూర్వ రావు ఆ వనపర్తి కానిస్టేబుల్ ని సస్పెండ్ కూడా చేసారు. ఆ తరువాత ఆమె ఏకంగా ఆ సదరు బాధితుడి ఇంటికి వెళ్లి అతడి కొడుకుతో మాట్లాడారు. 

చిన్నవయసులోనే పోలీసులపై ఈర్ష్యా ద్వేషాలను పిల్లలు పెంచుకుంటే... అది సమాజానికి మంచిది కాదని, ప్రజలందరికీ పోలీసులు తప్పులు చేస్తే కూడా శిక్షలు ఉంటాయని, పోలీసులు కూడా మానవత్వంతో పనిచేస్తారని చాటుకోవడానికి ఈ ప్రయత్నం  ఎంతగానో ఉపయోగపడింది. 

వనపర్తి లో అసలు ఏమి జరిగింది...?

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో  వనపర్తి పట్టణంలో పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపైకి వచ్చావంటూ కొడుకు ముందే  కానిస్టేబుల్ ఆ వ్యక్తిని చితకబాదాడు.  ఈ సమయంలో తన తండ్రిని కొట్టొద్దంటూ ఆ బాలుడు పోలీసులను వేడుకొన్నాడు.

Also read:కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్

అంకుల్  వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తండ్రిని విచక్షణరహితంగా కొట్టారు. తండ్రి కొడుకులను పోలీస్ వ్యాన్  ఎక్కించి తీసుకెళ్లారు.

ఈ దాడి దృశ్యాలను లక్ష్మణ్ అనే వ్యక్తి రికార్డు చేసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డిజీపీ మహేందర్ రెడ్డిని  కోరారు. 

ఈ ఘటనపై డీజీపీ విచారణ చేయాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు డీజీపీ మహేందర్ రెడ్డి. దీంతో ఎస్పీ  విచారణ జరిపారు. ఈ ఘటనకు కారణమైన ఆశోక్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా గురువారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు.