తెలంగాణలో ఒక్కరోజే 75 మందికి పాజిటివ్, కొత్తగా రెండు మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. అలాగే ఈ రోజు మరో ఇద్దరు రోగులు మరణించడంతో మృతుల సంఖ్య 11కి చేరింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. అలాగే ఈ రోజు మరో ఇద్దరు రోగులు మరణించడంతో మృతుల సంఖ్య 11కి చేరింది.
మరోవైపు కోవిడ్ సోకి కోలుకున్న వారిలో 15 మంది శుక్రవారం డిశ్చార్జ్ అవ్వగా.. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
Also Read:చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారని.. పోలీసులను చితకబాదిన తల్లీకొడుకులు
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులన్నీ కూడా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలతో సంబంధాలు ఉన్నవే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి ఆచూకి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. దీంతో వేలాది మందికి నిర్మల్ పట్టణంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి నివసించిన ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు.
ఇదిలావుంటే, ఇంటింటి సర్వే చేపట్టిన ఆశా వర్కర్లపై గురువారం ఓ వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దాడి చేశాడు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ లో పాల్గొని వచ్చిన వ్యక్తి ఆ దాడికి పాల్పడినట్లు ఆశా వర్కర్లు చెప్పారు.
Also Read:9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్
మర్కజ్ వెళ్లి వచ్చినవారి కోసం ఆశా వర్కర్లు ఈ సర్వే చేపట్టారు. తాము ప్రాణాలకు తెగించి సర్వే నిర్వహిస్తుంటే తమపై దాడి చేస్తున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా కరోనా వైరస్ కు దూరంగా ఉన్నట్లు భావించారు. కానీ, అకస్మాత్తుగా 23 మంది కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నట్లు తేలింది. దీంతో వారిని, వారి కుటుంబాలకు చెందిన 93 మందిని క్వారంటైన్ కు తరలించారు