తాండూరు:వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ గురువారం నాడు ఆత్మహత్య చేసుకొన్నారు. అపర్ణ వయస్సు 23 ఏళ్లు.

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అపర్ణ తిమ్మాయిపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా ఎన్నికైన రోజు నుండి అపర్ణ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

గ్రామ సర్పంచ్ గా ఆమె చేస్తున్న కృషితో పలువురు ప్రశంసలు పొందారు. కడుపునొప్పి భరించలేక బుధవారం నాడు ఆమె పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

తాండూరు ప్రభుత్వాసుపత్రిలో ఆమెకు ప్రాథమిక చికిత్స నిర్వహించారు.  అయితే తాండూరులో వైద్యులు చేతులెత్తేశారు. హైద్రాబాద్ కు తరలించాలని అపర్ణ కుటుంబసభ్యులకు సూచించారు.

అపర్ణను అంబులెన్స్ లో హైద్రాబాద్ కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు. మృతదేహానికి తాండూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అపర్ణ మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.

also read:శుభవార్త: 'హైద్రాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్‌‌ తెరిచే ఉంటాయి'

కరోనా ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను గ్రామ సర్పంచ్ లు ముందుండి నడవాలని సీఎం కేసీఆర్ సూచించారు.ఈ సమయంలో తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.