శుభవార్త: 'హైద్రాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ తెరిచే ఉంటాయి'
హాస్టల్స్ లో నుండి ఎవరిని బలవంతంగా తాము ఖాళీ చేయాలని కోరడం లేదని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యం ప్రకటించింది
హైదరాబాద్: హాస్టల్స్ లో నుండి ఎవరిని బలవంతంగా తాము ఖాళీ చేయాలని కోరడం లేదని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యం ప్రకటించింది. గురువారం నాడు ప్రైవేట్ హాస్టల్స్ యాజమానులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైద్రాబాద్ లో సమావేశం నిర్వహించారు.
హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులను వెంటనే ఖాళీ చేయాలని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు చెప్పడంతో ఎన్ఓసీ కోసం భారీ ఎత్తున వారంతా పోలీస్ స్టేషన్ల వద్ద బారులు తీరారు.
ఎన్ఓసీలు కోరిన వారిలో ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించింది. దీంతో ఎన్ఓసీల జారీని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రైవేట్ హాస్టల్స్ యజమానాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ సమస్యలను వివరించారు. హోల్ సేల్ వ్యాపారుల నుండి కూరగాయలు, నిత్యావసర సరుకులు హాస్టల్స్ నిర్వాహకులు తెచ్చుకొంటారు.
లాక్ డౌన్ కారణంగా హోల్ సేల్ వ్యాపారులకు ఇతర ప్రాంతాల నుండి సరుకులు రావడం లేదని చెబుతున్నట్టుగా హాస్టల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. తాము చెప్పిన రేటుకే నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలని చెప్పడంతో ఇబ్బందిగా మారిందని హాస్టల్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
Also read:కరోనా దెబ్బ: మీ వాహనం మూడు కి.మీ. దాటితే ఫైన్, డీజీపీ వార్నింగ్
హాస్టల్స్ లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఉన్నారు. ప్రైవేట్ హాస్టల్స్ లో వేలాది మంది ఉంటున్నారు. వీరంతా వర్క్ ఫ్రం హోమ్ నిర్వహిస్తున్నారు.
వాటర్ ట్యాంకులను తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని ప్రైవేట్ హాస్టల్స్ యజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.
ప్రైవేట్ హాస్టల్స్ యాజమానులు చెప్పిన సమస్యలను పరిష్కరించనున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చినట్టుగా ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు చెప్పారు.