కాంగ్రెస్ అనుకూల వైద్యులే విమర్శలు చేస్తున్నారు: తలసాని
కాంగ్రెస్ బ్యాచ్ కు చెందిన కొందరు జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే వైద్యులు మాత్రమే విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్:కాంగ్రెస్ బ్యాచ్ కు చెందిన కొందరు జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే వైద్యులు మాత్రమే విమర్శలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
బుధవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కొంత మంది మాత్రమే యంత్ర పరికరాలు లేవని విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యపరంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని చెప్పారు మంత్రి.
కాంగ్రెస్ నేతలు పనికిరాని దద్దమ్మలు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇస్తే తీసుకొంటామన్నారు..విమర్శలు చేసే వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. జ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుందన్నారు.
మీడియాలో కనిపించాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కొంతమంది దద్దమ్మలు గాలిమాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించొద్దని ఆయన కోరారు.
తప్పుడు ప్రచారం చేసే వాళ్లపైనే సీఎం కామెంట్స్ చేసిన విషయాన్ని తలసాని గుర్తు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా కు ఇచ్చిన గౌరవం ఏంటో అందరికి తెలుసునని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ నేతలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన కోరారు.
మర్కజ్ వెళ్లిన వాళ్ళను 24 గంటల్లోనే పట్టుకున్నట్టుగా తలసాని గుర్తు చేశారు. భాద్యతలు లేవి వ్యక్తులతో మేము మాట్లాడాలా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
Also read:కొడుకు ముందే తండ్రిపై పోలీసుల దాడి: వనపర్తి ఘటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే...
ప్రజలంతా లాక్‌డౌన్ కు సహకరిస్తున్నారన్నారు, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ చేసేందుకు రాష్ట్రంలో 20 వేల బెడ్స్ ను సిద్దం చేసినట్టుగా చెప్పారు మంత్రి , ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణలో 10 లక్షల మంది ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలతో సమానంగా వారందరికీ కూడ నిత్యావసర సరుకులను అందిస్తున్నట్టుగా చెప్పారు.