కొడుకు ముందే తండ్రిపై పోలీసుల దాడి: వనపర్తి ఘటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే...

వనపర్తిలో  ఓ వ్యక్తిని చితకబాదిన ఘటనలో ఎంతమందిపై చర్యలు తీసుకొన్నారో చెప్పాలని హైకోర్టు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.

how many police punished on wanaparthy incident asks Telangana high court

హైదరాబాద్: వనపర్తిలో  ఓ వ్యక్తిని చితకబాదిన ఘటనలో ఎంతమందిపై చర్యలు తీసుకొన్నారో చెప్పాలని హైకోర్టు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.

లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చినవారిపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేయడంపై అడ్వకేట్ ఉమేష్ చంద్ర తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను బుధవారం నాడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.

వీడియో కాన్పరెన్స్ ద్వారా హైకోర్టు ఈ పిల్ పై విచారణ చేసింది. తమ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన ప్రజలపై పోలీసులు దాడులు చేసిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే వనపర్తి ఘటనను కూడ ఆయన హైకోర్టు న్యాయమూర్తులకు వివరించారు.

Also read:కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్

సోషల్ మీడియాలో వనపర్తి ఘటనను తాము చూసినట్టుగా హైకోర్టు న్యాయమూర్తులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే వనపర్తి ఘటనను రాష్ట్రం మొత్తానికి ఆపాదించలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రజలు రోడ్లపైకి ఎందుకు వచ్చారో కనుక్కోవాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. వనపర్తి ఘటనపై ఈ నెల 17 లోపుగా ఎంతమంది పోలీసులపై చర్యలు తీసుకొన్నారనే విషయాన్ని తమకు వివరించాలని కోర్టు ఏజీని ఆదేశించింది. మరో వైపు ఈ పిల్ పై విచారణను ఈ నెల 17న విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios