Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ అంటే హడల్: స్వయంగా లాఠీ పట్టుకుని .. వింటే సరి, లేదంటే

సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఏకంగా రోడ్లపైనే తిష్ట వేసి జనాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. లాక్ డౌన్ మొదటి రోజు సౌమ్యంగా చెప్పిన ఎస్పీ రెండవ రోజు కూడా జనాలు రోడ్లపై కనపడటం స్వయంగా రంగంలోకి దిగి లాఠీకి పని చెప్పారు.

rajanna sircilla sp rahul hegde Serious on Public to Come on Roads
Author
Karimnagar, First Published Mar 25, 2020, 8:18 PM IST

కరోనా వైరస్ పై పోరాటంలో భారతదేశం ఒకడుగు ముందుకు వేసింది. దేశం మొత్తం లాక్ డౌన్ విధించి ఎక్కడిక్కడ దేశాన్ని అష్టదిగ్బంధనం చేసింది. కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాయి.

 

rajanna sircilla sp rahul hegde Serious on Public to Come on Roads

 

అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండటం కోసం వారు రోడ్డుపైకి వస్తున్నారు.

అందులో భాగంగా నిన్న కాకా మొన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఏకంగా రోడ్లపైనే తిష్ట వేసి జనాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Also Read:కరోనాపై హెచ్చరిక: కొత్తవారు ఇంటికి వస్తే వేయి జరిమానా

లాక్ డౌన్ మొదటి రోజు సౌమ్యంగా చెప్పిన ఎస్పీ రెండవ రోజు కూడా జనాలు రోడ్లపై కనపడటం స్వయంగా రంగంలోకి దిగి లాఠీకి పని చెప్పారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో వారికి వివరిస్తూ బయటకి రావటం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

ఇప్పటికే తెలంగాణలో అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుండటంతో సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ ప్రభుత్వ ఆదేశాలను కఠినంగానే అమలు చేస్తున్నారు. ఎందుకంటే విదేశాల నుండి వచ్చిన సిరిసిల్ల జిల్లాలో అధికంగా ఉండటంతో స్వయంగా విదేశాల నుండి వచ్చిన వారి ఇళ్లలోకి వెళ్లి సర్వేలు చేపడుతున్నారు.

 

rajanna sircilla sp rahul hegde Serious on Public to Come on Roads

 

అలా సర్వే చేపట్టిన వారిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటె దగ్గరుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను నిరంతరం పర్యవేక్షించేలా అధికారులను ఆదేశాలిస్తున్నారు.

స్థానిక పోలీసులు కూడా కరోనా లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లు కనిపిస్తే, విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారికి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ ని ఫోన్ చేయాలనీ ప్రచారం కల్పిస్తున్నారు. అంతే కాదు స్వయంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు చెప్తున్నారు.

Also Read:కరోనా లాక్ డౌన్: కత్తి దూసి పోలీసులనే బెదిరించిన మహిళా బాబా

ఇదంతా ఒక ఎత్తయితే సిరిసిల్ల జిల్లాలో దుబాయి, అరబ్ దేశాల నుండి వచ్చిన వలస వ్యక్తులు కూడా ఉండటంతో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన రోజు ఎవరు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అందరూ రోడ్ల పైకి రావటంతో జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి రోడ్డుపై తిరుగుతున్న జనాలకు హితబోధ చేస్తూ కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.  

ప్రాంతీయంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాకుండా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకేవేళ సూపర్ మార్కెట్లకు, నిత్యావసరాల కోసం వచ్చినా ప్రజలు అక్కడ సామజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios