దేశం లాక్ డౌన్... ఇంటికి వెళ్లడానికి రెండు రోజుల్లో 115కిలోమీటర్లు..
వరంగల్ నుంచి మంచిర్యాల వరకు రైల్వే ట్రాక్ పై నడిచాడు. రాత్రి వేళ ట్రాక్ పక్కన నిద్రించి ఉదయం లేవగానే నడక ప్రయాణం కొనసాగించాడు. రెండు రోజులపాటు 115 కిలో మీటర్లు నడిచి మంచిర్యాల లోని తన ఇంటికి చేరుకున్నాడు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 3లక్షల మందికిపైగా ఈ వైరస్ సోకి ఇబ్బంది పడుతున్నారు. భారత్ లోనూ దీని వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో... దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు.
Also Read శుభవార్త: 'తెలంగాణలో ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి'...
లాక్ డౌన్ నేపథ్యంలో... ఓ వ్యక్తి తన ఇంటికి చేరుకునేందుకు వాహనాలు లేక.. నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించాడు. కేవలం రెండు రోజుల్లో 115కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. వరంగల్ నుంచి మంచిర్యాల వరకు రైల్వే ట్రాక్ పై నడిచాడు. రాత్రి వేళ ట్రాక్ పక్కన నిద్రించి ఉదయం లేవగానే నడక ప్రయాణం కొనసాగించాడు. రెండు రోజులపాటు 115 కిలో మీటర్లు నడిచి మంచిర్యాల లోని తన ఇంటికి చేరుకున్నాడు.
అతను నడుకుంటూ ఇంటికి చేరుకున్నాడనే విషయం తెలిసి కుటుంబ సభ్యులే కంగుతిన్నారు. కాగా.. స్థానికంగా ఈ వార్త వైరల్ గా మారింది.