శుభవార్త: 'తెలంగాణలో ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి'

తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సంస్థలు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వస్తువులు కాకుండా ఇతర వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

Telangana dgp permits to e- commerce sites to serve food items

హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సంస్థలు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వస్తువులు కాకుండా ఇతర వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలకు పోలీసు శాఖ అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. . అయితే ఈ కామర్స్ సంస్థలకు శుక్రవారం నుండి అనుమతి ఇస్తున్నట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.

అమెజాన్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు నిత్యావసర సరుకులు,ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్టుగా పోలీసు శాఖ ప్రకటించింది.

ఆయా సంస్థల ప్రతినిధులు తాము ప్రాతినిథ్యం వహించే సంస్థల టీ షర్టులు ధరించాలని పోలీసు శాఖ సూచించింది. డెలీవరీ  బోయ్స్ ఉపయోగించే వాహనాలపై సరుకులు తరలించే వాహనాలుగా తెలిపే స్టిక్కర్లను కూడ ఉపయోగించాలని డీజీపీ సూచించారు.అంతేకాదు వాహనాలపై ఆయా కంపెనీల లోగోలను తప్పనిసరిగా అంటించాలని డీజీపీ కోరారు.

Also read:కరోనా దెబ్బ: మీ వాహనం మూడు కి.మీ. దాటితే ఫైన్, డీజీపీ వార్నింగ్

నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేయాలని డీజీపీ ఆదేశించారు.తమ సూచనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించనున్నట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కూడ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు తిరగకుండా ఉండేందుకు వీలుగా ఈ కామర్స్ సంస్థలకు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.

ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు సరుకులను అందించేందుకు అవకాశం కల్పిస్తామని తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios