కోమటిరెడ్డితో చర్చించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించాలి: కాంగ్రెస్ నేతలకు ప్రియాంక ఆదేశం
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించిన తర్వాతే మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచించింది.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుపుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించింది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ది ఎంపిక విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని కూడ పరిగణనలోకి తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేత నాయకత్వం సూచించింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోతే మాతో పాటు మీకు కూడా నష్టమని కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో ప్రియాంక గాంధీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్తి సమయం కేటాయిస్తానని కూడా ఆమె చెప్పారు. ఎవరైనా కూడా తమ సమస్యలను తనకు చెప్పుకోవచ్చన్నారు. రాష్ట్ర నేతలంతా కలిసి పని చేయాలన్నారు. కలిసి పనిచేస్తే మీకే లాభమన్నారు. ఒక్కొక్క నేతతో ప్రియాంక గాంధీ విడివిడిగా మాట్లాడారుపార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ, మధు యాష్కీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సమన్వయం చేసుకొనే బాధ్యతలను పార్టీ నాయకత్వం ఈ సమావేశంలో అప్పగించింది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికతో పాటు అనుసరించాల్సిన వ్యూహంపైచర్చించేందుకు గాను కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు న్యూఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నందున అతనితో కలిసి సమావేశానికి హాజరు కావడం ఇష్టం లేనందునే ఇవాళ సమావేశానికి దూరంగా ఉంటున్నట్టుగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖను పంపారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలను కూడా ఆ లేఖలో వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్ధిగా బరిలోకి దింపాలనే విషయమై పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది. పార్టీకి చెందిన రాష్ట్ర నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవాలని కూడ పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఈ మేరక పార్టీ నేత ప్రియాంక గాంధీ పార్టీ రాష్ట్ర నాయకులను ఆదేశించారు.
also read:హైకమాండ్‌తో ముగిసిన టీ.కాంగ్రెస్ నేతల భేటీ.. త్వరలోనే మునుగోడు అభ్యర్ధి ప్రకటన : రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి రేవంత్ రెడ్డి కారణమని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరు కాకుండా హైద్రాబా్ద్ కు వచ్చిన తర్వాత మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు మాణికం ఠాగూర్ ను కూడా ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.