మాస్క్‌లు పెట్టుకోకపోతే యముడు పట్టుకెళ్తాడు: కరోనాపై అవగాహనా కార్యక్రమం

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు క్వారంటైన్లు, ఐసోలేషన్లు అంటూ ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని ఎంతగా ఎంతమంది చెప్పినా కొందరు బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. 

Awareness on Corona Virus in karimnagar

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు క్వారంటైన్లు, ఐసోలేషన్లు అంటూ ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని ఎంతగా ఎంతమంది చెప్పినా కొందరు బాధ్యత లేకుండా తిరుగుతున్నారు.

Also Read:దేశంలో కరోనా కేసులు ఎందుకు పెరిగాయో తెలియదా: ఒవైసీపై రాజాసింగ్ ఫైర్

మరికొందరు వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని కట్టడి చేయడానికి వినూత్నంగా కరీంనగర్‌లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

Awareness on Corona Virus in karimnagar

మాస్కులు పెట్టుకోని వారిని యమ ధర్మరాజు పట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్యక్రమాన్ని చేపట్టారు టీఆర్ఎస్ నేత , తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి జీఎస్ ఆనంద్. యమ ధర్మరాజు వేషంతో ఉన్న కళాకారుడిని వెంటబెట్టుకుని ప్రజలకు, మార్కెట్లో ఉన్న వారికి ఆయన వివరించారు.

Also Read:మంచి మనసు చాటుకున్న కేటీఆర్... నాలుగేళ్ల క్యాన్సర్ చిన్నారికి వైద్యసాయం

సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తదితర అంశాలపై ఆనంద్ తెలిపారు. దీంతో అప్పటి వరకు మాస్కులు లేని వారు మాస్కులు పెట్టుకుని కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు విక్రయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పలువురు టీఆర్ఎస్ నేతలు అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios