దేశ సమైక్యత విషయంలో రాజకీయాలు వద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆదివారం మీడియాతో మాట్లాడిన దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొనడేమే కారణమన్నారు.

కరోనాకు మతం రంగు పులుముతున్నారని అనడానికి అసదుద్దీన్‌కు సిగ్గుండాలని రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య ఎందుకు పెరిగిందో తెలియదా అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు.

Also Read:కరోనా: నిజామాబాద్‌లో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

ఊరికే ముస్లింల మీద మాట్లాడే ఒవైసీ ఆయన నియోజకవర్గంలో కనీసం ఒక్క పేద ముస్లింకైనా ఒక్కపూట భోజనం పంపణి చేశారా అని నిలదీశారు. తన నియోజకవర్గంలో కుల, మతాలకు అతీతంగా ప్రతిరోజూ 3 వేల మందికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నానని రాజాసింగ్ స్పష్టం చేశారు.

నియోజకవర్గ ఎమ్మెల్యేగా అది తన బాధ్యతని... ఇంట్లో కూర్చొని ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం కాదని, దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని రాజాసింగ్ అన్నారు. చాలామంది పేద ముస్లింలు ప్రమాదంలో పడ్డారని, ముందు వాళ్లను కాపాడుకోవాలని ఆయన కోరారు.

Also Read:ఓవైసీ మూర్ఖుడు: మోడీపై విమర్శలకు బండి సంజయ్ ఘాటు రిప్లై

ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రధాని ఇచ్చిన పిలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాజాసింగ్ కోరారు. దీని ద్వారా ప్రపంచానికి జాతి ఐక్యతను తెలుపుతూ కరోనాను ఎదుర్కోగలమనే సందేశం ఇవ్వబోతున్నామన్నారు.

జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను విజయవంతం చేసిన దేశ ప్రజలు ఈ రోజు రాత్రి 9 గంటల 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పార్టీ తరపున ప్రతి బీజేపీ కార్యకర్త, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.