ఏం చేద్దాం.. ఎలా చేద్దాం: మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, పార్టీ చీఫ్‌లకు మోడీ ఫోన్
కరోనాను భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ విధించిన ప్రధాని.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
కరోనాను భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ విధించిన ప్రధాని.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలకు సైతం మోడీ ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి సంబంధించిన అంశాలను మోడీ వారితో చర్చించారు.
Aslo Read:కరోనా ఎఫెక్ట్: ఆసుపత్రిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం వారి వద్ద నుంచి సూచనలు, సలహాలను కోరినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు దేశంలోని పలు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు కూడా మోడీ ఫోన్ చేసినట్లుగా సమాచారం.
కాగా కరోనా కట్టడిలో భాగంగా మోడీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రతిపక్షాలపై నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించేటప్పుడు ఆయన ప్రతిపక్షాల నుంచి గానీ, సీఎం నుంచి ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Aslo Read:వారం రోజుల్లోనే కరోనాపై గెలుస్తానని శపథం: చెప్పినట్లుగానే కోలుకున్న నర్స్
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు మోడీ ఫోన్ చేసి కరోనా నివారణ చర్యలపై వారితో చర్చించారు.
ప్రధానంగా లాక్‌డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగుస్తుండటంతో ఆ తర్వాత ఏం చేద్దామనే దానిపై మోడీ అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లోని అన్ని పార్టీల సభాపక్ష నేతలతో ప్రధాని ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,374కి చేరగా, 77 మందికి వైరస్ సోకి మరణించారు.