కరోనాపై పోరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అనిర్వచనీయం. ప్రాణాలను పణంగా పెట్టి మరి వారు కరోనా రోగులకు సేవలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆ మహమ్మారి బారిన పడగా, మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు.

కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం కూడా కొందరు వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ నర్సు కరోనా బారినపడి, హస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. కొట్టాయంకు చెందిన రేష్మ మోహన్‌దాస్ కొట్టాయం మెడికల్ కళాశాలలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల థామస్ అబ్రహం, మరియమ్మ అనే వృద్ధ దంపతులు కరోనా బారినపడి ఈ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి చేరుకున్నారు.

Also read:ఆలస్యంగా కరోనా లక్షణాలు: 111 మందిని కలిసిన వ్యక్తి.....

ఈ వృద్ధ దంపతులు ఐసీయూలో ఉండగా వీరికి అవసరమైన సేవలన్నీ రేష్మనే చూసుకున్నారు. వైద్యుల కృషితో 90 ఏళ్ల వయసులోనూ ఈ వృద్ధ దంపతులు కోలుకున్నారు. అయితే చికిత్స సమయంలో రేష్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ బారిన పడ్డారు. క

రోనా లక్షణాల గురించి వెంటనే ఆమె ఉన్నతాధికారులకు చెప్పడంతో మార్చి 23న రేష్మకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలారు. అయినప్పటికీ ఏమాత్రం అధైర్య పడకుండా వారంలోనే కరోనా నుంచి కోలుకుని బయటకు వస్తానని ఆమె శపథం చేశారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: తండ్రికి గుండెపోటు.. ముంబై నుంచి కాశ్మీర్‌కు సైకిల్‌పై ప్రయాణం

ఇదే సమయంలో ఆమెతో పాటు పనిచేసిన నర్సులను అధికారులు హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. రేష్మ చేసిన సేవలను వృద్ధ దంపతులు కొనియాడారు. వారు ఇంటికెళ్లిన కొద్ది గంటల్లోనే రేష్మ కోలుకోవడం విశేషం.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఆమెను హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. రెండు వారాల విశ్రాంతి అనంతరం తిరిగి విధుల్లో చేరి రోగులకు సేవలు అందిస్తానని రేష్మ చెప్పారు. ఆమె విధి నిర్వహణ, అంకిత భావం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.