Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఆసుపత్రిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ జయప్రకాష్ నారాయణ అపెక్స్ ట్రామా సెంటర్ లో శనివారం నాడు అర్ధరాత్రి చోటు చేసుకొంది.

Man suspected of having coronavirus jumps off 3rd floor in AIIMS Delhi
Author
New Delhi, First Published Apr 5, 2020, 5:30 PM IST


న్యూఢిల్లీ: కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ జయప్రకాష్ నారాయణ అపెక్స్ ట్రామా సెంటర్ లో శనివారం నాడు అర్ధరాత్రి చోటు చేసుకొంది.

ఢిల్లీలోని ఐపీ ఏస్టేట్ కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో గత నెల 31వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు రాత్రి ఆసుపత్రి మూడో అంతస్తు నుండి ఆయన శనివారం నాడు రాత్రి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కానీ అతని కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

అతడి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అయితే ఈ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ సమయంలో అతను ఆసుపత్రి నుండి పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గతంలో కూడ ఢిల్లీలో కరోనా వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆసుపత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.  దేశంలో  ఆదివారం నాటికి 3374 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 79 మంది మృతి చెందారు. 

also read:దేశంలో 3374కి చేరిన కరోనా కేసులు, 79 మంది మృతి: కేంద్రం

కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్రం విధించింది. ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios