Asianet News TeluguAsianet News Telugu

కష్టపడి సాధించిన ట్రోఫీలను అమ్మేసి: పీఎం కేర్స్‌కు విరాళం

కరోనాతోపై పోరులో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు, కుబేరులు, రాయకీయ నాయకులు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత యువ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు

Golfer Arjun Bhati raises Rs 4.30 lakh by selling all his trophies donates money to PM CARES for coronavirus
Author
New Delhi, First Published Apr 8, 2020, 2:39 PM IST

కరోనాతోపై పోరులో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు, కుబేరులు, రాయకీయ నాయకులు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత యువ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.

గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి, కోవిడ్ 19పై పోరుకు విరాళాన్ని అందించాడు. పీఎం కేర్స్‌కు రూ.4.30 లక్షలు సాయం చేసినట్లు అర్జున్ తెలిపాడు. ఇంత చేసిన అతని వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే.

Also Read:కరోనాఎఫెక్ట్ :హిందూ మహిళ మృతి, పాడె మోసిన ముస్లింలు

ఇంత చిన్న తనంలోనే తన గొప్ప మనసు చాటుకుని ఈ కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కరోనాపై సాయం కోసం అతను విక్రయించిన ట్రోఫీల్లో జూనియర్ స్థాయిలో సాధించిన మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లతో పాటు జాతీయ ఛాంపియన్‌షిప్ కూడా ఉంది.

దీనిపై అర్జున్ మాట్లాడుతూ... ప్రస్తుతం దేశం ఎంతో కఠిన సమయం ఎదుర్కొంటోంది. దేశానికి సాధ్యమైనంత సాయం చేయాలని భావించానని చెప్పాడు. ఇందుకోసం 8 ఏళ్లలో 102 ట్రోఫీలు గెలిచానని, అవి అమ్మడం ద్వారా వచ్చిన రూ.4.30 లక్షలు  వచ్చాయని ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చానని అర్జున్ తెలిపాడు.

Also Read:క్వారంటైన్ లో మూత్రం బాటిళ్లు విసురుతున్న జమాత్ కార్యకర్తలు

సాయం చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అందువల్లే ట్రోఫీలు అమ్మేశానని అర్జున్ భాటి వెల్లడించాడు. ట్రోఫీలు కావాలంటే మళ్లీ భవిష్యత్తుల్లో కూడా సంపాదించుకోవచ్చు.. ప్రస్తుతం కరోనాపై మహమ్మారిపై విజయం సాధించాలని అతను స్పష్టం చేశాడు.

ట్రోఫీలను బయటి వారు కాకుండా తన బంధువులు, స్నేహితులే కొనుగోలు చేశారని.. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వాటిని వారికి అందజేస్తానని అర్జున్ వెల్లడించాడు. మరోవైపు భారత్‌లో కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం ఉదయానికి దేశంలో బాధితుల సంఖ్య 5,194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios