కరోనాఎఫెక్ట్ :హిందూ మహిళ మృతి, పాడె మోసిన ముస్లింలు
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన సౌకర్యం లేకపోవడంతో 65 ఏళ్ల హిందూ వృద్దురాలి అంత్యక్రియలకు స్థానిక ముస్లిం యువకులు సహాయం చేశారు. ఈ ఘటన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి
ఇండోర్:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన సౌకర్యం లేకపోవడంతో 65 ఏళ్ల హిందూ వృద్దురాలి అంత్యక్రియలకు స్థానిక ముస్లిం యువకులు సహాయం చేశారు. ఈ ఘటన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఈ అంత్యక్రియల పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్టణంలో 65 ఏళ్ల మహిళ మృతి చెందింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని రెండున్నర కిలోమీటర్ల దూరంలో స్మశాన వాటికకు తీసుకెళ్లాల్సి ఉంది.
also read;విషాదం:గుజరాత్‌లో కరోనాతో 14 నెలల బాలుడి మృతి
అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలు ఏవీ కూడ అందుబాటులో లేవు. దీంతో స్థానికంగా ఉన్న ముస్లిం యువత ఆ మహిళ పాడె మోసేందుకు ముందుకు వచ్చారు. ఆ మహిళ కొడుకులతో పాటు ముస్లిం యువత తమ ముఖానికి మాస్కులను ధరించి మహిళ పాడెను స్మశాన వాటిక వద్దకు మోసుకెళ్లారు.
దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో ఈ మహిళ సోమవారం నాడు మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. లాక్ డౌన్ ,కరోనా దృష్ట్యా మృతురాలి బంధువుల కూడ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భయపడ్డారని స్థానికులు చెప్పారు.
ఆ మహిళ ఇద్దరు కొడుకులతో పాటు స్థానికంగా ఉన్న ముస్లిం యువకులు పాడెను తమ భుజాలపై మోసుకొంటూ వెళ్లారు. తమ చిన్నప్పటి నుండి ఆ మహిళను చూస్తున్నామని.... ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి సహాయంగా నిలవాని భావించామని పాడెను మోసిన ముస్లిం యువకులు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ముస్లిం యువకులను అభినందించారు.