Asianet News TeluguAsianet News Telugu

ఆ ఛానెల్‌కి అక్రమంగా నిధులు,రఘురామకు లింకులు: ప్రధానికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు

ఓ తెలుగు న్యూస్  చానెల్ పై కేంద్ర ఆర్ధిక మంత్రికి వైసీపీ ఎంపీలు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ ఛానెల్ కు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయన్నారు.ఈ ఛానెల్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని వైసీపీ ఆధారాలను కూడ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమర్పించింది

Ysrcp mps complaint against news channel, Raghurama Krishnam Raju to modi lns
Author
Guntur, First Published Jul 26, 2021, 9:15 PM IST

న్యూఢిల్లీ: ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో పాటు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీలు  సోమవారం నాడు ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలు సమర్పించారు వైసీపీ ఎంపీలు. న్యూస్ ఛానెల్‌ యజమానికి, ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య ఆర్ధిక లావాదేవీలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. 

ఫెమా నిబంధనల్ని ఆ ఛానెల్‌ ఉల్లంఘించిందని ఆధారాలతో ప్రధానికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన ఆ ఛానెల్ పై సీబీఐ దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఆ ఛానెల్ మధ్య లక్ష యూరోల హవాలా ట్రాన్సాక్షన్ జరిగిందని ఎంపీలు ఆరోపించారు.

14 పేజీల లేఖలో ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలను ఎంపీలు ప్రధానికి, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి అందించారు. పీ సీఐడీ అధికారులు సేకరించిన సమాచారాన్ని కూడ ఈ పిర్యాదులో పేర్కొన్నారు.ఈ అక్రమ లావాదేవీల వ్యవహరంపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని కోరారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు దేశం విడిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కూడ ఎంపీలు కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios