కరోనా లాక్ డౌన్.. యువకుడిని చితకబాదిన పోలీస్, సస్పెన్షన్
లాక్ డౌన్ పాటించకుండా ఓ యువకుడు బయటకు వచ్చాడని పోలీసు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఎస్ఐ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి లో చోటు చేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుంది.
వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రధాని మోడీ దేశమంతా 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించేకన్నా ముందే.... దేశంలోని చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ ని ప్రకటించివేశాయి. ఈ లాక్ డౌన్ సందర్భంలో కొందరు ప్రజలు ఒకింత నిబంధనలు ఉల్లంఘిస్తున్నమాట వాస్తవమే అయినా... పోలీసులు సైతం తమ అధికార ఝులుమ్ ని ప్రదర్శిస్తున్నారు.
Also Read దాచేపల్లి ఘర్షణ: ఏపీ డీజీపి గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదీ.....
లాక్ డౌన్ పాటించకుండా ఓ యువకుడు బయటకు వచ్చాడని పోలీసు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఎస్ఐ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి లో చోటు చేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా పేరవల్లి ఎస్ఐ లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. రూల్స్ పాటించకుండా ఓ కుటుంబం బయట అడుగుపెట్టింది. దీంతో... ఎస్ఐ... ఆ కుటుంబం పై లాఠీ ఛార్జ్ చేశాడు. మహిళలను కూడా వదలకుండా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హోంశాఖ మంత్రి సదరు ఎస్ఐ ని సస్పెండ్ చేశారు.