ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు: 16కు చేరుకున్న సంఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. చీరాలలోని వృద్ధ దంపతులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే, కర్నూలు జిల్లాలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

Three more corona postive case in Andhra Pradesh: toll  reaches 16

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. ప్రకాశం జిల్లా చీరాలలో గల నవాబ్ పేటలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

భర్త ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ నెల 18వ తేదీన తిరిగి వచ్చాడు. అతని నుంచి భార్యకు కరోనా సోకింది. వారిద్దరు కూడా వృద్ధులు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వారిద్దరు ఒంగోలులోని రిమ్స్ లో గల ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 

కర్నూలు జిల్లాలో ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతను రాజస్థాన్ కు చెెందిన యువకుడు. రైల్వేలోపనిచేస్తాడు. ప్రజలకు అనుమానం వచ్చి అధికారులకు తెలియజేశారు. దీంతో ఈ నెల 24వ తేదీన అతన్ని అధికారులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ గా ఉన్నట్లు తెలిసిందే.యువకుడితో టచ్ లోకి వచ్చిన 51 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios