Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: పొందుగుల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత, ఏపీలోకి నో ఎంట్రీ

తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి  కోసం వేలాది మంది గుంటూరు జిల్లా పొందుగుల బ్రిడ్జి  వద్ద  ఎదురుచూస్తున్నారు. ఏపీ పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 

 

Tension prevails at pondugula bridge in Guntur district
Author
Guntur, First Published Mar 26, 2020, 10:32 AM IST

గుంటూరు: తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి  కోసం వేలాది మంది గుంటూరు జిల్లా పొందుగుల బ్రిడ్జి  వద్ద  ఎదురుచూస్తున్నారు. ఏపీ పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 

హైద్రాబాద్‌ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు  తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని  తెలంగాణ పోలీసుల నుండి అనుమతి  తీసుకొని ఏపీ రాష్ట్ర సరిహద్దులకు వచ్చారు.

బుధవారం నాడు సాయంత్రం నుండి ఇవాళ ఉదయం వరకు కూడ ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వేలాది మంది నిలిచి ఉన్నారు.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఉన్న కొందరిని రాష్ట్రంలోని అనుమతి ఇచ్చారు. ఆరోగ్య కారణాలతో పాటు ఇతరత్రా కారణాలను దృష్టిలో ఉంచుకొని వారికి అనుమతులు ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద అన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా పొందుగుల బ్రిడ్జి వద్ద  వేలాది  మంది రాత్రి నుండి సరిహద్దు వద్దే నిలిచిపోయి ఉన్నారు.

తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులతో గొడవకు దిగారు. కొన్ని చోట్ల ఉన్నవారిని ఎందుకు అనుమతించారని  ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణ నుండి వచ్చినవారిని రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు ఏపీ సర్కార్.ఐసోలేషన్ లో ఉంటామని హామీ ఇస్తేనే అనుమతి ఇస్తామని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది.

దీంతో ఏపీ బోర్డర్ కు వచ్చిన కొందరు తిరిగి తెలంగాణకు వెళ్లారు. ఏపీ రాష్ట్ర సరిహద్దులకు వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టుల వద్ద కూడ ఎన్ఓసీ తీసుకొని ఏపీ వైపుకు వస్తున్న వారిని పోలీసులు తిరిగి వెనక్కి పంపిస్తున్నారు.

పొందుగుల బ్రిడ్జి వద్ద  రాత్రి నుండి ఉన్న వారు పోలీసులతో గొడవకు దిగడంతో  గురువారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios