రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒక ముఖ్యమంత్రి, 26 మంది మంత్రులు, అధికారులు ఉన్నా సరిపోక మరో 10 మంది సలహాదారులుగా పెట్టుకున్నా సాధించింది శూన్యం మాత్రమే అని మాజీ మంత్రి కెఎస్.జవహర్ మండిపడ్డారు.  అజయ్ కల్లం, సజ్జల రామకృష్ణా రెడ్డిలు అధికార పార్టీ ప్రతినిధులుగానే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా ప్రభుత్వ సలహాదారులుగా పని చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. సలహాదారులందరూ రాజకీయంగా రావాలనుకుంటే నేరుగా వైకాపా కండువా కప్పుకొని రావాలి గాని ఇలా సలహాదారుల ముసుగులో అధికార పార్టీ తొత్తుల్లా పని చేయడం హేయమని విమర్శించారు. 

కరోనా ఈ రకంగా స్వయం విహారం చేస్తుంటే ఈ సలహాదారులందరూ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. వీరందరూ జగన్ కు పారాసిట్మాల్, బ్లీచింగ్ కు సంబంధించిన సలహాలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. లాక్ డౌన సందర్బంలోనూ మద్యం యదేచ్చగా ఎందుకు దొరుకుంది? అని ప్రశ్నించారు. 

''మద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు వాడుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? సాక్షాత్తు డిపార్ట్ మెంట్ వ్యక్తులే దాదాపు 5 లక్షల విలువ గల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుపడిన విషయం వాస్తవం కాదా? అసలు ఎక్సైజ్ మంత్రి నాన్ డ్యూట్ పెయిడ్ ను ఏ విధంగా నియత్రిస్తున్నారు? అందులో ఆయన కమీషన్లు తీసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి'' అని ఆరోపించారు. 

''స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు అధిక మద్యాన్ని కొనుగోలు చేశారు. తీరా ఎన్నికలు వాయిదా పడటంతో   ఆ మద్యాన్ని నేడు బెల్ట్ షాపులుగా మార్చి అమ్ముతున్న విషయం వాస్తవం కాదా?  నర్సరావుపేటలో వైకాపా నాయకుల దగ్గర మద్యం దాచుకున్నారు. తెలంగాణాలో మద్యానికి బానిస అయిన వ్యక్తులు ఎర్రగడ్డకు వెళుతున్నారు. కాని ఏపీలో అందుకు భిన్నంగా ఉంది'' అని అన్నారు. 

''జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పెట్టిన ప్రెస్ మీట్లో తప్పుల తడకలు వెల్లు వెత్తున్నాయన్న భయంతోను, ప్రభుత్వ వైఫల్యాలను పాత్రికేయులు ఎక్కడ ప్రశ్నిస్తారని మూడో ప్రెస్ మీట్ రికార్డెడ్ పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండి ప్రజల్లో భరోసాను నింపుతుంది. కాని జగన్ మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన క్యారంటైన్ లో ఉన్నారన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతుంది'' అని అన్నారు.

''పశ్చిమ గోదావరిలో స్పిరిట్ తాగి ముగ్గురు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. మద్యపానాన్ని అందుబాటులో లేకుండా చేసి మీ అనునాయుల చేత బెల్ట్ షాపులు పెట్టించి అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో మాస్కులు, శానిటైజర్లు దొరకడం లేదు గాని మద్యం మాత్రం విచ్చల విడిగా దొరుకుంది. వైసీపీ నాయకుల ఇళ్లు తనిఖీ చేస్తే మద్యం భారీ ఎత్తున దొరికే అవకాశం ఉంది'' అని పేర్కోన్నారు. 

''ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలు అక్రమంగా చేసుకొని నల్లధనాన్ని ఆర్జిస్తున్నారు. మండలానికి కొన్ని వేల లీటర్ల సారాయి దొరుకుతుంది. వైకాపా నాయకుల ప్రధాన ఆదాయ వనరుగా సారాయి ఉంది. వాలంటర్లు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అధికారపక్షం నాయకులకు ఆదాయం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర భవిష్యత్ మీద లేదు'' అని మండిపడ్డారు. 

''20 మంది సలహాదారులను క్యాబినేట్ హోదా ఇచ్చి మంత్రులకు షాడోగా జగన్ ఉంచారు. జగన్  అవసరమైతే షాడో క్యాబినేట్ అనే శాఖ కూడా ఉంటే బాగుంటుంది. ప్రతిపక్షాన్ని ఏవిధంగా లోబర్చుకోవాలన్న సూచనలను మాత్రమే సలహాదారులు జగన్ కు ఇస్తున్నారు. జగన్ కూడా అవే పాటిస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుంది'' అని కె.ఎస్. జవహార్
 అన్నారు.