కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలోనే చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలో చెన్నై తీరంలో ఏపీకి చెందిన మత్స్యకారులు ఇరుక్కుపోయారు.

Also Read:దేశంలో 24 గంటల్లో 92 కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి

ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన జనసేనాని మత్స్యకారులను ఆదుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. మత్స్యకారులను రక్షిస్తామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడుకు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్ దగ్గర చిక్కుకుపోయారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ

ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం పళని స్వామికి ట్వీట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనికి ప్రత్యేకంగా తమిళంలో వారి ఇబ్బందులను తెలియజేశారు. కాగా దేశంలో కరోనా కారణంగా 24 గంటల్లో 92 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 1,150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లుగా కేంద్రం స్పష్టం చేసింది.