నెల్లూరు: ఆనందయ్య మందు విషయమై   తాను అవినీతికి పాల్పడాలనే ఆలోచన వచ్చినా తనతో పాటు  తన కుటుంబం సర్వనాశనం అయిపోతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనందయ్య మందు విషయమై కాకాని గోవర్ధన్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆనందయ్య మందును ఆన్‌లైన్ లో పంపిణీ చేయనున్నారు.ఆన్‌లైన్ లో  మందు పంపిణీ కోసం తయారు చేస్తున్న వెబ్‌సైట్  విషయమై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ విషయమై శేశ్రిత కంపెనీ  ప్రతినిధులు తమ వెబ్‌సైట్ పై తప్పుడు ప్రచారం చేశారని కేసు పెట్టారు.

also read:ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తనను లక్ష్యంగా చేసుకొని సోమిరెడ్డితో పాటు  టీడీపీ నేతలు  విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై కాకాని గోవర్ధన్ రెడ్డి  సోమవారం నాడు మరోసారి స్పందించారు. తనపై అవినీతి ఆరోపణలు  చేస్తున్నవారిని ఆయన హెచ్చరించారు. కొందరు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఆనందయ్య మందు పంపిణీ విషయంలో  అవినీతికి పాల్పడాలనే ఆలోచన వచ్చినా తనతో పాటు తన కుటుంబం సర్వనాశనం అయిపోతోందన్నారు. ఆనందయ్య మందు పంపిణీ ఇవాళ ప్రారంభమైంది. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు కృష్ణపట్టణంలో మందు పంపిణీని ఆనందయ్య  ఇవాళ ప్రారంభించారు.