కరోనా కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల ధరలను ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా అమ్ముతూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

దీనిపై సర్కార్ కట్టుదిట్టంగా వ్యవహరించడంతో పాటు ప్రతిరోజూ కూరగాయలు ఇతర నిత్యావసరాల ధరలను ప్రకటిస్తోంది. అయినప్పటికీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవహరిస్తున్నారు.

Also Read:కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం

ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. సినీ ఫక్కీలో మారువేషంలో తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో కూరగాయలు, నిత్యావసర ధరలు పెంచి అమ్ముతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ దీనిపై దృష్టి సారించారు.

మంగళవారం ఉదయం నగరంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రూ.5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు.

Aslo Read:ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు: ఆ 39 మంది కోసం పోలీసుల గాలింపు

దీని ఆధారంగా ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా మారువేషంలో వచ్చి తమతో మాట్లాడింది జిల్లా కలెక్టర్ అని తెలుసుకుని, కొంతమంది వ్యాపారలు అవాక్కయ్యారు.

అటు తెలంగాణ ప్రభుత్వం సైతం నిత్యావసరాల ధరలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంది. ఆ ధరలను మించి ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. అధిక ధరలు అమ్మినవారి గురించి 1902 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించింది.