Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ కరోనా చికిత్స... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారిని అరికట్టే చర్యలను జగన్ సర్కార్ మరింత ముమ్మరంచేసింది. 

Jagan Government Sensational Decision  on corona outbreak
Author
Vijayawada, First Published Apr 6, 2020, 9:30 PM IST

అమరావతి: కోవిడ్ 19 కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కోవిడ్ 19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసీజర్స్ ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా అనుమానం, వ్యాధి నిర్దారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్దారించింది. కనీసం 16 వేల నుంచి గరిష్టంగా 2లక్షల 16 వేలు నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లో ఆసుపత్రుల్లో చేర్చుకోవడం,ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. సోమవారం 8 గంటల వ్యవధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కరోనా వైరస్ కేసులు 303కు చేరుకున్నాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 18, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కొత్త ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరుల 42 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 27, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం ఆరు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 32 కేసులు రికార్డయ్యాయి. మర్కజ్ వెళ్లి వచ్చినవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీకి వెళ్లినవచ్చినవారందరినీ గుర్తించామని, వారికి సంబంధించినవారిని కూడా గుర్తించామని, వారందరినీ క్వారంటైన్ కు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలు జిల్లాలో మరో 70 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో సోమవారం మరో రోగి రికవరీ అయినట్లు, అతన్ని డిశ్చార్జీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఆరుగురు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి.

అనంతపురం 6
చిత్తూరు 17
తూర్పు గోదావరి 11
గుంటూరు 32
కడప 27
కృష్ణా 29
కర్నూలు 74
నెల్లూరు 42
ప్రకాశం 24
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 21

Follow Us:
Download App:
  • android
  • ios