కరోనా ఎఫెక్ట్: క్వారంటైన్‌కు 16,723 బెడ్స్ సిద్దం చేసిన ఏపీ సర్కార్

రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు

government sets up 16,723 beds for quarantine in Ap

అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో సర్వే చేసేందుకు రెండు రకాల బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, రేషన్ పంపిణీపై సీఎం జగన్ సోమవారం నాడు అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం తీసుకొన్న నిర్ణయాలను ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీమ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ టీమ్ లో వార్డు వలంటీర్, రిపోర్స్ పర్సన్, ఎఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. ఇక కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో టీమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్ లు తమకు కేటాయించిన వార్డుల్లో పర్యటించి సర్వే నిర్వహించనున్నారు.

ఈ టీములు ప్రతి రోజూ తమకు కేటాయించిన ఇళ్లలోని వారి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సీఎం సూచించారు.ఈ మేరకు సర్వేలు కొనసాగుతాయని మంత్రి కన్నబాబు చెప్పారు. బీపీ, షుగర్, గుండె జబ్బులున్నవారిని ముందే గుర్తించాలని ఆయా కమిటిలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులకు ఆయా జిల్లా కలెక్టర్లు చేర్చాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను 1370ల నుండి 1600లకు పెంచాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రతి కరోనా ఆసుపత్రికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం సూచించినట్టుగా ఆయన తెలిపారు.

Also read:ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు: 23 మందికి పాజిటివ్ లక్షణాలు

క్వారంటైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16,723 బెడ్స్ సిద్దం చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి జిల్లాలో ఐదు వేల బెడ్స్ తో ఆసుపత్రులను సిద్దం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని కన్నబాబు చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలను కూడ కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వినియోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని మంత్రి తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios