వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐకి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సీబీఐకి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారంనాడు లేఖ రాశారు.

Former AP intelligence chief AB Venkateswara rao writes letter to CBI over Ys Vivekananda Reddy murder case lns

అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సీబీఐకి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారంనాడు లేఖ రాశారు.వివేకానందరెడ్డి  హత్య జరిగి ఏడాది దాటినా కూడ  కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదన్నారు. వివేకా హత్య కేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపినట్టుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  ఈ విషయమై సీబీఐ అధికారి  ఎస్‌కే సింగ్ కు కూడ ఫోన్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఆయన నుండి ఎలాంటి స్ప్ందన రాలేదన్నారు.

also read:వివేకాది వైఎస్ ఇంటి మార్క్ మ‌ర్డ‌ర్...: అయ్యన్నపాత్రుడు సంచలనం

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున సంఘటన స్థలంలోకి మీడియాను ఇంటలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదని ఆయన గుర్తు చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో  ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు. ఈహత్య జరిగి ఇంత కాలమైనా ఇంతవరకు దోషులను పట్టుకవడంపై వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి  ఢిల్లీలో సీబీఐ అధికారలను ఇటీవల కలిసి  వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా  ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios