శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ముందుగా  శిఖరేశ్వరంకి మూడు కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాప్తి  చెందినప్పటికీ ఆ మంటలు శిఖరేశ్వరం వైపుకి మరలండంతో గమనించిన శ్రీశైలం అటవీశాఖ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించి ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 

ఈ నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండ అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తరచూ అడవి ప్రాంతంలో లో మంటలు చెలరేగి ఉన్నప్పటికీ టైగర్ ట్రాక్టర్స్ అలాగే అటవీశాఖ నిఘా కెమెరాలు అలాగే వాచర్లు మొదలగు సిబ్బంది ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతాన్ని గమనిస్తూనే ఉండడంతో చాలావరకు ప్రమాదాలను అరి కడుతున్నారు. 

అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా ఆకతాయిలు అడవి ప్రాంతంలో నిప్పు పెట్టడంతో కొంతమేర దహనమైనట్లు అధికారులు తెలిపారు.  ఎప్పటికప్పుడు అధికారులు విషయాన్ని గమనించి త్వరతిగతిన చర్యలు తీసుకుంటుండటంతో ప్రమాద తీవ్రత తగ్గుతోంది.