అమరావతి: ఇప్పటికు కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఏలూరులో చాలామంది అనారోగ్యానికి గురవగా అందుకు గల కారణాలను డాక్టర్లు కూడా గుర్తించలేకపోయారు. జాతీయ, రాష్ట్ర స్థాయి వైద్యారోగ్య సంస్థలు కూడా ఏలూరు ప్రజల అనారోగ్యంపై ఓ నిర్దారణకు రాలేకపోయాయి. దీంతో ప్రభుత్వం దీన్ని తేల్చేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ తాజాగా తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది.   

గత ఏడాది డిసెంబర్ 4 నుండి 12వ తేది వరకు 622 మంది అస్థత్వతకు కారణం కూరగాయుల కలుషితం కావడమేనంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నిపుణుల కమిటీ. ఏటూరువాసుల అనారోగ్యానికి కూరగాయల్లోని రసాయనాలే ముఖ్యకారణమని నిర్దారించింది. ఏలూరు మార్కెట్ కు వచ్చిన కూరగాయాలు అక్కడి నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో తెలిపింది నిపుణుల కమిటీ.

read more  ఏలూరు వింత వ్యాధి: జగన్ చేతికి నివేదిక.. కారణం ఇదే

కూరగాయల్లోని ఆర్గానో క్లోరైడ్ వల్ల ప్రజలు ఆనారోగ్యానికి గురైనట్లు నిర్ధారించింది. అయితే శరీరంలో 24 గంటల తరువాత పరీక్షలు జరిపినా ఆర్గోనో క్లోరైడ్ ప్రభావం కనుపించదని... అందుకే రక్త నమూనాల్లో ఆర్గానో క్లోరైడ్ కనుపించలేదని పేర్కొంది. బాధితుల లక్షణాలను బట్టి ఆర్గానో క్లోరైడ్ ప్రభావంగా గుర్తించినట్లు నిపుణుల కమిటీ తెలిపింది.

నీరు, పాలు, కూరగాయలు, పండ్లు ద్వారా ఆర్గానో క్లోరైడ్ బాదితుల శరీరంలోనికి ప్రవేశించిందని... అందులో కూరగాయల వల్లే ఎక్కువగా ఈ పరిస్థితి వచ్చిందని నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసిన నిపుణల కమిటీ. నీరు కూడా కలుషితంగానే వుందని నివేదికలో పేర్కొంది.

ఇన్ఫెక్షన్, జీవ ప్రక్రియలో మార్పులు, రసాయనాల ప్రభావం వల్ల బాధితులు ఆనారోగ్యం పాలయ్యారని గుర్తించింది. ఇక బాదితుల రక్త నమూనాలో భారలోహకాలు కనుపించడం యాదృశ్ఛికమే అని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది.