Asianet News TeluguAsianet News Telugu

ఉపాధి కూలీగా మారిన సీపీఐ నారాయణ: చిత్తూరు జిల్లాలో చెరువు పూడికతీత

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాను వ్యాఖ్యలు, పనులతో ఆయన మీడియాలో పతాక శీర్షికల్లో నిలుస్తుంటారు. తాజాగా సీపీఐ నారాయణ ఉపాధి కూలీగా మారారు.
 

CPI National secretary Narayana participates in MGNREGA in chittoor district lns
Author
Chittoor, First Published May 6, 2021, 3:52 PM IST

చిత్తూరు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాను వ్యాఖ్యలు, పనులతో ఆయన మీడియాలో పతాక శీర్షికల్లో నిలుస్తుంటారు. తాజాగా సీపీఐ నారాయణ ఉపాధి కూలీగా మారారు.చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని అయానంబాకం గ్రామ చెరువులో  ఉపాధి హామీ పనుల్లో రెండు రోజులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి పాల్గొన్నారు.  రెండు రోజులుగా ఆయన చెరువు పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలతో కలిసి పనిచేస్తున్నారు. 

లెప్ట్ పార్టీల పోరాటం కారణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు మజ్జిగ, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణులు ఉపాధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.  రెండు రోజులుగా అనధికారికంగానే  ఈ పనుల్లో పాల్గొంటున్నట్టుగా చెప్పారు.  అధికారికంగా పాల్గొనాలంటే గుర్తింపు కార్డు అవసరం ఉంటుందని ఆయన  చెప్పారు.  గత వారం రోజుల క్రితం ఆయన తన స్వగ్రామం వెళ్లారు. చాలా రోజుల తర్వాత గ్రామానికి చేరుకొన్న నారాయణ గ్రామస్తులతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios