కరోనా జ్వరంలాంటిదేనని వైఎస్ జగన్ వ్యాఖ్య: ఉతికి ఆరేసిన యనమల
కరోనా వైరస్ కూడా జ్వరంలాంటిదేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
అమరావతి: కరోనా వైరస్ వ్యాధిపై ఏపీ ముఖ్యమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. కరోనా వైరస్ జ్వరం లాంటిదేనని, భయం అవసరం లేదని వైఎస్ జగన్ బుధవారంనాడు అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆయన జగన్ ను నిలదీశారు.
దాన్ని బట్టి చూస్తే జగన్ కు ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. భవిష్యత్తు సమస్యలను ఎదుర్కోవడంపై ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా మొక్కుబడి మీడియా సమావేశం నిర్వహించారని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు
Also Read: ఏపీలో కరోనా విలయతాండవం: ఒక్కరోజే 67 కేసులు, మొత్తం 111
రాష్ట్రాదాయం మందగిస్తోందని జగన్ చెప్పడంపై స్పందిస్తూ ఈ విషయంలో చేపట్టబోయే చర్యలను వెల్లడించకపోవడాన్ని తప్పు పట్టారు. దానిపై నిపుణుల సలహాలు కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. కరోనాను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
మీడియా సమావేశం పెడితే ప్రశ్నలు వేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదని యనమల అడిగారు. వాస్తవాలను మరుగుపరిచి తప్పించుకోవాలని చూస్తే కరోనా వైరస్ కన్నా ఎక్కువ ప్రమాదం జరుగుతుందని ఆయన అన్నారు.