మంత్రులా, బూతుల ప్రొఫెసర్లా... సీఎం జగనే వారిని ప్రోత్సహిస్తున్నారా?: వర్ల రామయ్య

మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోోరారు టిడిపి నాయకులు వర్ల రామయ్య.   

Coronavirus... TDP Leader Varla Ramaiah Slams Kodali Nani

గుంటూరు: పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(కొడాలి నాని)ని మంత్రిగా నియమించే సమయంలోనూ, ఆ తర్వాత ఆయన వ్యవహార శైలి ముఖ్యమంత్రినే కాదు ప్రజల్ని ఆకర్షించిన దాఖలాలు లేవని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య మండిపడ్డాయి. ఆయన మాట తీరు, ఆహర్యం చూసి కూడా కేబినెట్లో కొనసాగిస్తున్నారంటే.. ఈ ప్రభుత్వానికి ప్రజా పాలనపట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. 

కొడాలి నానిని బూతుల మంత్రి అని రాష్ట్ర ప్రజలంతా పిలుస్తారనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కరోనా మహమ్మారి నుండి ఏ విధంగా బయటపడాలా అని ఆలోచిస్తుంటే గౌరవ బూతుల మంత్రి మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు విస్మయం కలిగించాయని అన్నారు. అది నోరా.. తాటి మట్టా అనిపిస్తోందని మండిపడ్డారు.

కొడాలి నానిలాంటి వ్యక్తిని కేబినెట్లో ఏ విధంగా ఉంచారో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. మంత్రిగా ఉంటూ. ఇలా బూతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాడని ముఖ్యమంత్రికి అనిపించలేదా..? లేక ముఖ్యమంత్రే ఈ విధంగా మంత్రుల్ని ప్రోత్సహిస్తున్నారా...? 
అని  ప్రశ్నించారు. 

''రేషన్ సరుకుల్ని ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా వల్లెవేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సరుకుల కోసం క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఈ విషయం పౌర సరఫరాల శాఖా మంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. వాలంటీర్లతో ఎందుకు పంపడం లేదని ప్రశ్నిస్తే.. బూతులు తిడతారా.? ప్రభుత్వం ఎన్ని దుర్మార్గాలు చేసినా, పారాసిటమాల్ తో కరోనా నయమైపోతుందని చెప్పినా.. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా.?'' అని  ప్రశ్నించారు.చ

''చోడవరంలో రేషన్ సరుకుల కోసం క్యూలైన్ లో నిలబడి మీరాబీ చనిపోయిన విషయం ఈ మంత్రికి కనిపించలేదా...? క్యూలైన్ లో నిలబడి కొడాలి నానిని కలవరిస్తూ చనిపోతేనే దాన్ని గుర్తిస్తారా...? ఇలాంటి వాటిపై ప్రశ్నిస్తే బూతుల మంత్రుల్ని పక్కనపెట్టుకుని ప్రతిపక్షాలను తిట్టిస్తారా.? కొడాలి నానికి ఆయన శాఖపై పట్టు లేదు. ఎన్ని రేషన్ కార్డులున్నాయో, ఎన్ని సరుకులు ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఏం సాధించాలనుకుంటున్నారు.? ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చా అని ఏనాడూ ముఖ్యమంత్రి గారికి అనిపించలేదా.?'' అని  నిలదీశారు. 

''మీరాబీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పరిహారం ప్రకటించాలి. కరోనా మహమ్మారిపై చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తే.. ఈ ముఖ్యమంత్రి పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ హేళన చేశారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వం కంటే ముందే కరపత్రికలు వేశాం, పుస్తకాలు ముద్రించాం, ప్రజల్ని అప్రమత్తం చేశాం. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికీ పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ పాట పాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''కరోనాపై ప్రభుత్వ చర్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయి. ఇతర దేశాల నుండి ఎంత మంది వచ్చారో ప్రభుత్వం వద్ద లెక్కాపత్రం లేదంటే.. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతోంది. ఢిల్లీలో ప్రార్ధనలకు ఎంత మంది ముస్లింలు వెళ్లారో లెక్కలేదు. అందులో ఎంత మందికి పరీక్షలు నిర్వహించారో లెక్కలేదు. రాష్ట్రంలోని వలసదారులకు సంబంధించిన లెక్కలు  లేవు. వీటిని అడిగితే ఈ పనికిమాలిన మంత్రులు మీడియా సమావేశం పెట్టి బూతులు తిడతారా.?'' అని అడిగారు. 

''ఇదేనా ప్రభుత్వ పాలన...? ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించడం ఇదేనా.? వైద్యారోగ్య శాఖ అధికారులు, కార్యదర్శులు ఇంత వరకు మీడియా ముందుకు ఎందుకు రాలేదు.? రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై అవగాహన ఉన్న వారిని పక్కన పెట్టి సలహాదారులు మీడియాతో మాట్లాడడం ప్రభుత్వ వైఫల్యాలను తొక్కిపెట్టడానికి కాదా.? కరోనాపై ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రజలకు అర్ధమైపోయింది. ఈ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడింది కాపీ కొట్టడం తప్ప చేసిందేమీ లేదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించండి'' అంటూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వర్ల రామయ్య సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios