ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

 కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించేందుకు గాను ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  ఈ రోగాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి  రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది.ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

coronavirus in andhra pradesh:Aarogyasri to cover covid-19 treatment

అమరావతి: కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించేందుకు గాను ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.  ఈ రోగాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి  రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది.ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ గత నాలుగైదు రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కానీ, మంగళవారం నాడు ఒక్క కొత్త కేసు నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో 304 కేసులు నమోదయ్యాయి.

కరోనా లక్షణాలున్న వారికి వైద్యం చేస్తున్న వారికి  రూ. 10,774 చెల్లిస్తారు, వైద్యం  చేసినవారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కింద రూ.5,631 చెల్లించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసిన  ఆసుపత్రులకు ఒక్కరికి రూ. 16,405 ఇవ్వనున్నారు. 

కరోనా పాజిటివ్ కేసులకు రూ. 65 వేల నుండి రూ. 2.15 లక్షలను కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్ల నుండి అర కిలోమీటరు దూరం వరకు రాకపోకలను నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios