పశ్చిమ గోదావరి జిల్లాలో 14మందికి పాజిటివ్: ఏపీలో 58కి పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే విపరీతమైన కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య ఒక్కసారిగా 58కి చేరుకుంది.
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 14 మదికి కరోనా వైరస్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 58కి చేరుకుంది.
ఏలూరులో ఆరు, భీమవరంలో రెండు, పెనుగొండలో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఉండి, గుండుగొలను, అకివీడు, నారాయణపురంల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడింది. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు ఆ విషయం వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 30 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 14 మందికి కోవిద్ 19 ఉన్నట్లు ఈ వైద్యపరీక్షల్లో తేలిందని చెప్పారు. పది మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ఆరుగురికి సంబంధించిన పరీక్షల నివేదికలు రావాల్సి ఉదని ఆయన చెప్పారు. నిన్న మరకో నాలుగు కేసులు కూడా బయటపడ్డాయి. ఈ నాలుగు కేసులు కూడా విశాఖపట్నంలోనే నమోదయ్యాయి.
జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి....
ప్రకాశం 11
గుంటూరు 9
విశాఖ 10
కృష్ణా 5
తూర్పు గోదావరి 4
అనంతపూర్ 2
నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి
పశ్చిమ గోదావరి 14