Asianet News TeluguAsianet News Telugu

వృద్ధుడికి కరోనా.. తెలీక 24మందిని కలిసి...

ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయన 16 మంది కుటుంబ సభ్యులను, బయట వ్యక్తులు 8 మందిని కలిశారు. అయితే కలిసిన 16 మంది కుటుంబ సభ్యుల్లో తన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉండగా, వీరిలో వృద్ధుడి కొడుకు మినహా మిగిలిన ముగ్గురికి వైరస్‌ వ్యాపించింది. 
 

corona positive person met 24 persons in west godaveri dist
Author
Hyderabad, First Published Apr 3, 2020, 7:42 AM IST

దేశంలో కరోనా మృతులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మూడు వారాల లాక్ డౌన్ తో పరిస్థితులు మొత్తం మెరుగౌతాయని.. దేశంలో నమోదైన అర, కొర కేసులు సమసిపోతాయని అందరూ భావించారు. అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ.. కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన తబ్లీగీ జమాత్ సదస్సుకి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వెళ్లి రావడం కొంప ముంచింది.

కేవలం రెండు, మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. తాజాగా.. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఓ 72ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఈయనకు మార్చి 30న కరోనా సోకింది. ప్రస్తుతం విశాఖపట్నం విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అయితే  ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయన 16 మంది కుటుంబ సభ్యులను, బయట వ్యక్తులు 8 మందిని కలిశారు. అయితే కలిసిన 16 మంది కుటుంబ సభ్యుల్లో తన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉండగా, వీరిలో వృద్ధుడి కొడుకు మినహా మిగిలిన ముగ్గురికి వైరస్‌ వ్యాపించింది. 

Also Read బ్రేకింగ్: ఏపీలో మరో 6గురికి కరోనా పాజిటివ్, 149 కేసులతో తెలంగాణను మించిపోయింది...

ఈమేరకు బుధవారం రాత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయి.    అలాగే ఈ ముగ్గురు ఎనిమిది మందిని కలిసినట్టు వైద్యశాఖ వెల్లడించింది. కాగా తన తండ్రిని రాజమహేంద్రవరంలో కలిసి వచ్చిన తర్వాత కొత్తపేట మండలంలో 200 మందికి విందు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. 

దీంతో వారిని రావులపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు పంపారు. కానీ స్థానికులు ఆందోళన చేయడంతో భట్లపాలెం కాలేజీ క్వారంటైన్‌కు తరలించారు.    

ఇదిలా ఉండగా.. పశ్చిమగోదావరి  జిల్లా నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లినవారు 35 మందిగా జిల్లా వైద్య శాఖ నిర్దారించింది. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నట్టు గుర్తించారు. దీంతో 33 మందిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే వీరు  ఎవరెవరిని జిల్లాలో కలిశారనేది ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.

 అటు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారిలో ఇప్పటికే ముగ్గురికి వైరస్‌ సోకడంతో మిగిలిన వారు ఎవరెవరిని కాంటాక్ట్‌ అయ్యారనేది నివేదిక సిద్ధం చేశారు. ఇక కొత్తపేటలో ఓకేసారి మూడు పాజిటివ్‌ కేసులు రావడంతో వైద్య, పోలీసుశాఖలు అలర్ట్‌ అయ్యాయి. మూడు కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటించి అప్రమత్తమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios