విజయవాడ కరోనా పాజిటివ్ తో ఓ వ్యక్తి మృతిచెందడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వారికి ధైర్యంనింపే ప్రయత్నం చేశారు నగర కమీషనర్ ద్వారకా తిరుమలరావు.  ఇందులోభాగంగా విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఆయన స్వయంగా పర్యటించి ప్రజల్లోవున్న అనుమానాలను నివృత్తిచేసే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ లో ఇప్పటివరకు మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 11కేసులు ఢీల్లి నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్నవారు కాగా మిగతా 5విదేశాలనుండి వచ్చినవారని  వివరించారు. 

పాజిటీవ్ గా తేలిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నామన్నారు. డీల్లి సదస్సుకు వెళ్ళి వచ్చిన కుమ్మరి పాలెం సెంటర్ కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందన్నారు. అతడి తండ్రికి వయసు మీదపడటంతో తీవ్ర అనారోగ్యానికి గుకయి మృతిచెందినట్లు... ఇందులో ఎవరిని తప్పు పట్టడం లేదన్నారు. 

డిల్లి సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు, వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలని సిపి సూచించారు. చాలామంది స్వచ్చందంగా ముందుకు వచ్చి పరిక్షలు చేయించుకుంటున్నారని...మిగతావారు కూడా ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, వారి కుటుంభ సభ్యుల క్షేమమే తమకు  ముఖ్యమన్నారు. 

విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలలో కర్ప్యూ విధించామని... కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా తొలి మరణం విజయవాడలో జరగడం బాధాకరమన్నారు. ఈ విషయం గురించి ముందుగానే హెచ్చరించామన్నారు. అయితే వారు పట్టించుకోక పోవటం, అతనికి ఇతర వ్యాదులు ఉండటంతో మరణం జరిగిందన్నారు. 

 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌