కరోనాపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలి: ఏపీ ప్రభుత్వానికి బాబు డిమాండ్

ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే వెంటిలేటర్లను తయారు చేసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సూచించారు.మరో వైపు రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కేంద్రాలను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

 

Chandrababu demands government to tell facts on corona cases in Andhra pradesh

హైదరాబాద్:ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వమే వెంటిలేటర్లను తయారు చేసుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సూచించారు.మరో వైపు రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కేంద్రాలను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కరోనాతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మత, రాజకీయ సదస్సులను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. 

కరోనాను దృష్టిలో ఉంచుకొని బౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కరోనా వైరస్ అమెరికాను సైతం భయపెడుతున్నట్టుగా ఆయన చెప్పారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను చెప్పాలని ఆయన కోరారు. ఏపీలో కరోనా పరీక్ష కేంద్రాలను మరింత పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని ఆయన ఆరోపించారు. 

వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న వారికి అవసరమైన ప్రొటెక్షన్ దుస్తులను అందించాలని ఆయన కోరారు.కరోనా విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కరోనాపై తప్పుడు ప్రచారంపై జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. 

also read:కరోనా రోగుల ఇళ్లకు అరకిలోమీటరు దూరం వరకు రాకపోకలు బంద్: ఏపీ సర్కార్ నిర్ణయం

రాష్ట్రంలో పేదలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు మొదటి విడతగా రూ. 5 వేలు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఇస్తున్ననగదుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడ నగదును ఇవ్వాలని ఆయన కోరారు.తెల్లరేషన్ కార్డులున్నవారికి నగదును ఇవ్వాలని ఆయన సూచించారు.60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు

పేదలకు వెయ్యి రూపాయాల పంపిణీ సమయంలో వైసీపీ కార్యకర్తలు వెళ్లడం సరైంది కాదన్నారు. అంతేకాదు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయాలపై గవర్నర్ దృష్టి పెట్టాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వేతనాలే ఇవ్వడం సరైంది కాదన్నారు. పూర్తి జీతాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios