ఏపీపై కరోనా దెబ్బ: మరో 21 కొత్త కేసులు, 132కి చేరిక కేసులు

 ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 24 గంటల్లో  కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు ఉదయానికి  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132కు చేరుకొన్నాయి. 
 

Andhra pradesh reports 21 more corona cases, total cases rises to 132

అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 24 గంటల్లో  కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు ఉదయానికి  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 132కు చేరుకొన్నాయి. 

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మూడు నాలుగు రోజులుగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ లో మత ప్రార్థనలకు హాజరైన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా ప్రభుత్వం చెబుతోంది.

Also read:ప్రకాశం జిల్లాలో మరో రెండు కేసులు: ఏపీలో 113కు పెరిగిన సంఖ్య

రాష్ట్రంలో 1800 మంది శాంపిల్స్ ను ల్యాబ్ పంపారు. వీరిలో 1175 మందికి నెగిటివ్ వచ్చింది. 493 మంది రిపోర్టులు ఇంకా  రావాల్సి ఉంది. కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ రెండు జిల్లాల్లో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను కూడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.


 జిల్లాల వారీగా నమోదైన కొత్త కరోనా కేసులు
కృష్ణా- 15
గుంటూరు - 20
ప్రకాశం - 17
కడప- 15
చిత్తూరు - 8
విశాఖ- 11
అనంతపురం- 2
నెల్లూరు- 20
కర్నూల్- 1
పశ్చిమ గోదావరి-  14


నెల్లూరు- 20
కర్నూల్- 1
పశ్చిమ గోదావరి-  14

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios