కరోనా విజృంభిస్తున్నా అలా చేయడం ఎన్నికల ఉల్లంఘనే... చర్యలు తప్పవు: ఏపి ఈసీ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ తెలిపారు.

Andhra pradesh chief Secretary Comments Coronavirus outbreak

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంటే స్వయంసేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం , స్వప్రయోజనాల కై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. 

ఈ విషయంపై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని... 13 జిల్లాల ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. 

కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ, కొత్త పథకాలు ఎన్నికల ఉల్లంఘన కింద రాదని.... ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియజేస్తున్నామన్నారు. 

పోటీ చేసే అభ్యర్థులు వారి స్వియ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్  దృష్టికి తీసుకుని రావాలన్నారు. 

సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ సూచించారు. కలెక్టర్లకు రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios