కరోనా: ఏపీలో 15 గంటల్లో 15 కొత్త కేసులు, మొత్తం 329కి చేరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గంటల్లో మరో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాడు ఉదయానికి 329కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 గంటల్లో మరో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాడు ఉదయానికి 329కి చేరుకొన్నాయి.
రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఆరు,కృష్ణాలో6, చిత్తూరు జిల్లాలో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. . కరోనా వైరస్ సోకిన ఆరుగురు ఇప్పటికే కోలుకొన్నారు. ఈ వ్యాది సోకి రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు.
మంగళవారం నాడు రాత్రి నాటికి ఏపీ రాష్ట్రంలో 314 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 గంటల్లో మరో 15 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 329కి చేరుకొన్నాయి. మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి బుధవారం నాడు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో ఈ 15 కేసులు నమోదైనట్టుగా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
also read:ఏపీలో కరోనా కరాళ నృత్యం: 314 మంది పాజిటివ్ గా నిర్ధారణ!
రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి.ఈ జిల్లా నుండే మర్కజ్ కు సుమారు 200 మంది వెళ్లి వచ్చారు.ఆ తర్వాతి స్థానంలో నెల్లూరు జిల్లా నిలిచింది. నెల్లూరు జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది.గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా నిలిచింది.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడ నమోదు కాలేదు.