ఏపీలో మరణ మృదంగం: ఒక్కరోజులో 69 మరణాలు.. 12 వేలు దాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లోనే తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటాయి. దీంతో దేశంలో కోవిడ్ విజృంభణ భయంకరంగా వున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ఏపీ పోటీపడుతోంది.

12634 new corona cases reported in andhra pradesh ksp

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లోనే తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 12 వేలు దాటాయి. దీంతో దేశంలో కోవిడ్ విజృంభణ భయంకరంగా వున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ఏపీ పోటీపడుతోంది..

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 12,634 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 10,33,560కి చేరింది.

నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 69 మంది మరణించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,685కి చేరింది. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో 12,  నెల్లూరు 7, తూర్పుగోదావరి 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 6, పశ్చిమగోదావరి 6, అనంతపురం 5, కడప 5, చిత్తూరు 4, గుంటూరు 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు.

గడిచిన 24 గంటల్లో 4,304 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,36,143కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 89,732కి  చేరుకున్నాయి. గత 24 గంటల్లో 62,885 మంది శాంపిల్స్ పరీక్షించగా... ఇప్పటి వరకు ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,59,94,607కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1095, చిత్తూరు 1628, తూర్పుగోదావరి 952, గుంటూరు 1576, కడప 219, కృష్ణ 641, కర్నూలు 1158,  నెల్లూరు 1258, ప్రకాశం 353, శ్రీకాకుళం 1680, విశాఖపట్నం 1051, విజయనగరం 692, పశ్చిమ గోదావరిలలో 331 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios