టాటా నెక్సాన్ ఈ‌వి కార్ లాంచ్...ధర ఎంతంటే..?

టాటా నెక్సాన్ ఈ‌వి కార్ 3 వేరియంట్లలో లభిస్తుంది. టాటా XM, XZ +, XZ + కంఫర్ట్ క్రియెషన్స్ తో పాటు 35 కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వస్తుంది.

tata nexon ev car launched in india

టాటా మోటార్స్ కంపెనీ ఈ రోజు  కొత్త జెనరేషన్ ఎలక్ట్రిక్ కార్లలో మొదటి జిప్ట్రాన్ టెక్నాలజీతో వస్తుంది. ఇప్పుడు నెక్సాన్ ఈవి భారత మార్కెట్లోకి ప్రవేశించింది.టాటా నెక్సాన్ ఈ‌వి ధర రూ.13.99 లక్షల నుండి ప్రారంభమయి రూ.15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వరకు ఉంటాయి.

నెక్సాన్ ఈ‌వి 3 వేరియంట్లలో లభిస్తుంది. XM, XZ +, XZ + అదనపు కనెక్టెడ్ కార్ ఫీచర్లతో  వస్తుంది. ఈ కార్ లో ఉన్న  ఫీచర్స్ పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్ట్  కార్ యాప్, స్టార్ట్ బటన్ తో కీలెస్ ఎంట్రీ, నాలుగు పవర్ విండోస్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఉన్నాయి.

also read భారత్ బెంజ్ నుంచి కొత్త బి‌ఎస్ 6 ట్రక్కులు & బస్సులు

టాప్ వేరియంట్లో హర్మాన్ బ్రాండ్ నుండి 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, స్మార్ట్ ఫోన్ బెసేడ్ నావిగేషన్, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ కమాండ్, ఆపిల్ కార్ ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, 7 అంగుళాల డాష్‌టాప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి.రివర్స్ పార్క్ అసిస్ట్‌తో వెనుక పార్కింగ్ కెమెరా, లెదర్ స్టీరింగ్ వీల్‌ను కూడా ఈ కారు పొందుతుంది.

tata nexon ev car launched in india

టాటా నెక్సాన్ ఈ‌వి పర్మనెంట్ మాగ్నెట్ ఎసి మోటారును ఇందులో ఉపయోగించారు. ఇది లిథియం-అయాన్ బ్యాటరీతో లిక్విడ్-కుల్డ్, IP67 సర్టిఫైడ్ చేయబడింది. దీని అర్థం బ్యాటరీ ప్యాక్ నీరు, దుమ్ము, ధూళి రెసిస్టంట్ ఉంటుంది. నెక్సాన్ ఈ‌వి 30.2 kWh బ్యాటరీని ఇందులో అమర్చారు, ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 312 కి.మీ. ప్రయాణించవచ్చు.

also read వాహన కొనుగోలుదారులకు షాక్: కార్ల ధరలు పెంపు...

నెక్సాన్ ఈ‌వి లోని కొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 245 Nm పీక్ టార్క్ ని విడుదల చేస్తుంది. ఇది 9.9 సెకన్లలో ట్రిపుల్ అంకెల వేగాన్ని అందుకుంటుంది.దీనికి ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి 60 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అయితే హోమ్ ఛార్జర్‌ను ఉపయోగించి చార్జ్ చేస్తే సుమారు 8 గంటల సమయం పడుతుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ నిమిషానికి 4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మీకు 50 శాతం ఛార్జ్ ఉంటే నెక్సాన్ ఇవి 150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చెయ్యొచ్చు.టాటా నెక్సాన్ ఈ‌వి కూడా ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ఉంది. ఇది ఎనిమిది సంవత్సరాల వరకు లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం రూపొందించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios