భరత్‌బెంజ్ కొత్త  ట్రక్కులు, బస్సులను గడువుకు ముందే బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ఆవిష్కరించింది.. ఇందులో కొత్త అప్ డేట్స్, సౌకర్యవంతమైన క్యాబిన్ ఇంకా  భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి.డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (డిఐసివి) దేశానికి కొత్త బిఎస్ 6 కంప్లైంట్ రేంజ్, భారత్  బెంజ్ బిజినెస్ వాహనాలను ఆవిష్కరించింది.

also read వాహన కొనుగోలుదారులకు షాక్: కార్ల ధరలు పెంపు...

ఈ కొత్త వాహనాలు రాబోయే బి‌ఎస్6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండటమే కాకుండా కొత్త డిజైన్, కొత్త వాహన టెలిమాటిక్స్ సిస్టం అలాగే ఇంతకు ముందు ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి.కొత్త బిఎస్ 6 రేంజ్ వాహనాలను పాత వెర్షన్‌తో పోలిస్తే 10 శాతం ధరల పెరుగుదల ఉంటుందని భారత్‌ బెంజ్ సంస్థ తెలిపింది. 

డైమ్లెర్ ఇండియా ఇప్పటికే కొత్త బిఎస్ 6 రేంజ్ ట్రక్కులు, బస్సుల కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది.ఈ సందర్భంగా డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ఎండి & సిఇఒ సత్యకం ఆర్య మాట్లాడుతూ "భారత్‌ బెంజ్  కొత్త సివి రేంజ్ భారతీయ వినియోగదారులకు మెరుగైన ఇంధన సామర్థ్యంతో, హెవీ డ్యూటీ ట్రక్కులకు కొత్త బెంచ్ మార్కులను ఏర్పాటు చేస్తుంది"  

సి‌వి రేంజ్ OM026 ఇంజిన్, 4D34i నుండి శక్తినిస్తుంది. ఇవి BS4 వెర్షన్ లాగానే ఉంటాయి కంపెనీ ట్రక్కులపై ఆరు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో  మరో రెండు సంవత్సరాల వరకు అదనంగా  ఇస్తుంది. వీటి  మెంటేనెన్స్ కూడా ఆరు శాతం వరకు తగ్గిస్తుందని చెబుతారు.

also read మహీంద్రా నుండి కొత్త ఆఫ్-రోడ్ వాహనం....

బిఎస్ 6 కోసం సుమారు  500 కోట్లు పెట్టుబడి పెట్టారని, 1000 కి పైగా కొత్త స్పేర్ పార్ట్లను అభివృద్ధి చేశామని వాహన తయారీ సంస్థ తెలిపింది.  కొత్త రేంజ్ మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులు అలాగే బస్సులు ఇప్పుడు ప్రాఫిట్ టెక్నాలజీ + తో వచ్చాయి, ఇది ఇంధన సామర్థ్యం, ​​భద్రత, సౌకర్యం మెరుగుపరుస్తుంది.

కొత్త భరత్‌బెంజ్ వాహనాలకు కొత్త బంపర్ స్పాయిలర్‌తో రి డిజైన్ చేసిన గ్రిల్, ఎయిర్ సస్పెండ్ సీట్లతో మెరుగైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, రివర్స్ పార్కింగ్, సెంట్రల్ లాకింగ్, సీట్‌ బెల్ట్ వార్నింగ్ వంటి కొత్త మార్పులు వచ్చాయి. సంస్థ  ప్రోసర్వ్ మొబైల్ అప్లికేషన్ అడ్వాన్స్ బుకింగ్స్, పార్ట్స్ ఆర్డరింగ్, కాంట్రాక్ట్ రెన్యువల్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇన్సూరెన్స్, ఫ్లీట్ మెయింటెనెన్స్, 24x7 ఆర్‌ఎస్‌ఎ ఇంకా  ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ తో సహా 65కి పైగా ఫీచర్లను ఇందులో ఉన్నాయి.