Asianet News TeluguAsianet News Telugu

వచ్చేనెలలో విపణిలోకి హోండా ‘డబ్ల్యూఆర్-వీ’.. సరికొత్త ఫీచర్లతో..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ బీఎస్-4 మోడల్ స్థానే బీఎస్-6 మోడల్ కారును వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. మారుతి విటారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, హ్యుండాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యూవీ కార్లతో హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారు తల పడనున్నది. 

New 2020 Honda WR-V facelift officially revealed ahead of April launch
Author
Hyderabad, First Published Mar 6, 2020, 11:41 AM IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ డబ్ల్యూఆర్-వీ 2020 మోడల్ కారు భారత విపణిలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. నూతన డిజైన్‌తో రూపుదిద్దుకున్నది. ఫేస్ లిప్టెడ్ హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారు గ్రిల్లె ఫీచరింగ్ హరిజొంటల్ స్లాట్స్, సాలిడ్ వింగ్ క్రోమ్ గ్రిల్లెలతో న్యూ రేడియేటర్ రూపుదిద్దుకున్నది. 

గత డబ్ల్యూఆర్-వీ మోడల్ కారులో హాలోజనెన్ హెడ్ ల్యాంప్స్ ఉంటే, తాజాగా ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్‌తో రానున్నది హోండా డబ్ల్యూఆర్-వీ. సీ -షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్‌తో రేర్ కాంబినేషన్ కానున్నది. 

also read ‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?

హోండా డబ్ల్యూఆర్-వీ బీఎస్-4 మోడల్ కారుతో పోలిస్తే బీఎస్-6 మోడల్ కారులో 7.0 అంగుళాల డిజిపాడ్ 2.0 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, శాట్-నవ్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్రిక్ట్ సన్ రూఫ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు చేర్చారు.

బీఎస్-4 ప్రీ ఫేస్ లిఫ్ట్ డబ్ల్యూఆర్-వీ కారు 1.2 లీటర్ల ఐ-వీటెక్ పెట్రోల్, 1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజిన్లతో వినియోగదారులకు లభ్యం కానున్నది. డబ్ల్యూఆర్-వీ క్రాస్ ఓవర్ కారులో గత ఇంజిన్లే ఉన్నా బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు. పూర్తిగా అప్ డేట్ చేసిన ఈ కారు వచ్చేనెలలో విపణిలోకి రానున్నది. 

also read హైదరాబాద్‌ మార్కెట్లోకి కొత్త బైక్...గంటకు 85 కిలోమీటర్ల వేగంతో...

2020 మారుతి విటారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, హ్యుండాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యూవీ కార్లతో హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారు తల పడనున్నది. 

బీఎస్-4 మోడల్ కారుతో పోలిస్తే 2020లో విడుదల కానున్న బీఎస్-6 హోండా డబ్ల్యూఆర్-వీ కారు ధర ఎక్కువగానే ఉండనున్నది. ప్రస్తుతం ధర రూ.8.08 లక్షల నుంచి ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios