‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?
బీఎండబ్ల్యూ కారు విపణిలోకి ఎక్స్1 పేరుతో నూతన కారును ఆవిష్కరించింది. స్పోర్ట్స్ ఎక్స్, ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లలో ఈ కారు లభించనున్నది. దీని ధర రూ.35.90 లక్షల నుంచి రూ.42.90 లక్షలుగా నిర్ణయించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా భారతదేశ మార్కెట్‌లోకి సరికొత్త వర్షన్ కారును ఆవిష్కరించింది. ‘ఎక్స్1’ పేరిట ఆవిష్కరించిన ఈ కారు ప్రారంభ ధర రూ.35.90 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.42.90 లక్షలుగా ప్రకటించారు.
ఈ కారులో బీఎండబ్ల్యూ భారీగానే కాస్మొటిక్ మార్పు తీసుకొచ్చింది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సరికొత్త 2.0 సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.
ఇప్పటికే ఆడి, బెంజ్ కంపెనీలు కూడా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌తో విపణిలోకి వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
also read ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల వాహనాలను రికాల్ చేసిన టొయోటా...
సరికొత్త ఎక్స్ 1 కారు స్పోర్ట్స్ ఎక్స్, ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లలో బీఎండబ్ల్యూ విపణిలోకి విడుదల చేసింది. బీఎండబ్ల్యూ భారత్ సీఈఓ రుద్రతేజ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘స్పోర్ట్స్ యాక్టివిటీ వాహనాల విభాగంలో బీఎండబ్ల్యూదే పూర్తి ఆధిపత్యం.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఎక్స్1 మోడల్ కారుతో వాహన ప్రేమికులు థ్రిల్ పొందాలని ఆకాంక్షిస్తున్నాం’ అని చెప్పారు.
ఈ కారు లుక్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీఎండబ్ల్యూ మార్క్ కిడ్ని గ్రిల్స్ సైజును కూడా ఈసారి పెంచేశారు. ఇక హెడ్ ల్యాంప్స్‌లో సరికొత్త క్లస్టర్, ఎల్ఈడీ డేటైమ్ లైట్లు అమర్చారు. ఎం స్పోర్ట్ వేరియంట్‌లో సరికొత్త క్లస్టర్, ఎల్ఈడీ డే టైం వంటివి ఉన్నాయి.
also read మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్ కారు విడుదల...6 సెకన్లలో 100కి.మీ వేగంతో....
ఇక క్యాబిన్‌లో సరికొత్త 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఐడ్రైవ్ ఇన్ఫోటైన్మెంట్ అమర్చారు. దీనిలో ఆపిల్ కార్ ప్లే మాత్రమే కనెక్ట్ అవుతుంది. పనోరమిక్ సనర్ రూఫ్, ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్ మెంట్ (ఆప్షన్)గా అందిస్తున్నారు.
బీఎండబ్ల్యూ ఎక్స్1 డ్రైవ్ 20ఐ స్పోర్ట్ ఎక్స్ పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ. 35,90,000 కాగా, బీఎండబ్ల్యూ ఎక్స్1 డ్రైవ్ 20ఐ స్పోర్ట్ ఎక్స్ లైన్ పెట్రోల్ వర్షన్ కారు ధర రూ.38,70,000. బీఎండబ్ల్యూ ఎక్స్1 డ్రైవ్ 20డీ ఎక్స్ లైన్ డీజిల్ వేరియంట్ కారు ధర రూ. 39,90,000లకు, బీఎండబ్ల్యూ ఎక్స్1 డ్రైవ్ 20డీ ఎం స్పోర్ట్ డీజిల్ వేరియంట్ కారు రూ. 42,90,000లకు లభ్యం కానున్నది.