Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ కారు...వారికి రూ.1 లక్ష తగ్గింపు...

ఎంజీ మోటార్స్ తన తొలి విద్యుత్ ఎస్‌యూవీ వాహనాన్ని భారత విపణిలో గురువారం ఆవిష్కరించింది. దీని ధర 20.88 నుంచి రూ.23.58 లక్షలు పలుకుతుంది. రెండు వేరియంట్లలో విడుదల చేసిన ఈ కారు బుకింగ్స్ ఈ నెల 17వ తేదీనే ముగించారు. నాటిలోగా బుక్ చేసుకున్న వారికి రూ.లక్ష తక్కువకే కారు సరఫరా చేయనున్నది ఎంజీ మోటార్స్. కేవలం ఎనిమిది క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారు సొంతం. 

mg motors launches electric internet suv zs ev in india
Author
Hyderabad, First Published Jan 24, 2020, 10:48 AM IST

న్యూఢిల్లీ: హెక్టర్‌ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను గణనీయంగా ఆకట్టుకుటున్న ఎంజీ మోటార్స్‌ జడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును విపణిలోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్‌ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్ ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

also read టయోటా, హోండా కార్లలో సమస్యలు... 60 లక్షల యూనిట్ల రీకాల్​ 

ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 17వ తేదీతో ఈ కార్ల బుకింగ్స్‌ నిలిపివేశారు. అప్పటిలోపు బుక్‌ చేసుకున్న వారికి రూ.లక్ష తగ్గింపు ధరతో విక్రయిస్తారు.

mg motors launches electric internet suv zs ev in india

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనే ఈ కారును విడుదల చేశారు. ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని అమర్చారు. దీన్ని ఒకసారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. 

also read కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!

40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. కేవలం ఎనిమిది క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారు సొంతం. ఆఫీస్‌, ఇంట్లో ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ను ఎంజీ అందజేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios