Asianet News TeluguAsianet News Telugu

కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!

దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ నూతన మోడల్ ‘కార్నవాల్’ కొత్త రికార్డులు నమోదు చేసింది. ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో కియా మోటార్స్ ఈ కార్లను విడుదల చేయనుంది. ఇందు కోసం ప్రారంభించిన ప్రీ-బుకింగ్​కు అదిరిపోయే స్పందన వచ్చిందని పేర్కొంది కియా. భారత్​ నుంచి ఒక్కరోజులోనే 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.
 

Kia Motors receives orders for 1,410 units of Carnival on 1st day of booking
Author
Hyderabad, First Published Jan 23, 2020, 2:47 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా మోటార్స్​ తాజాగా విడుదల చేయనున్న సరికొత్త వాహనం 'కార్నివాల్​'. దీని కోసం తాము బుకింగ్ మొదలుపెట్టిన మొదటి రోజే భారత్​ నుంచి 1,410 యూనిట్లకు ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది. మొత్తం బుకింగ్‌ల్లో 64 శాతం మూడు వేరియంట్లలో ఒకటైన లిమోసిన్​ ట్రిమ్​కు చెందినవేనని వెల్లడించింది.

also read మార్కెట్లోకి టాటా మోటార్స్ కొత్త కారు...ధర ఎంతంటే ?

కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ కేకే షిమ్​ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కియా కార్నివాల్ విడుదలకు ముందే అద్భుత ఆదరణ లభిస్తోంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది. మేము ప్రీ-ఆర్డర్లు ప్రారంభించిన ఒక్క రోజులోనే భారత్​ మార్కెట్​ నుంచి 1,410 యూనిట్లు బుక్ అయ్యాయి. ఇది భారత్​లో కియాకున్న డిమాండ్​ను స్పష్టం చేస్తోంది’ అని చెప్పారు.

Kia Motors receives orders for 1,410 units of Carnival on 1st day of booking

వచ్చేనెలలో ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్​పోలో కియో మోటార్స్ తమ కార్నివాల్ మోడల్ కారును భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందు​ కోసం మంగళవారం తన అధికారిక వెబ్​సైట్​ ద్వారా బుకింగ్స్ ప్రారంభించింది. దేశంలోని 265 టచ్​ పాయింట్లలో రూ. లక్ష చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చునని కియా మోటార్స్ తెలిపింది.

also read హ్యుందాయ్ నుండి కొత్త కార్ లాంచ్... బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి...

కియా కారు ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ అనే మూడు వేరియంట్లలో రానుంది. 7,8,9 సీటింగ్ కాన్ఫిగరేషన్లూ వీటిలో ఉంటాయి.

ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన లమోసిన్​ మోడల్​ 8-స్పీడ్ ట్రాన్స్ మిషన్​తో జత చేసిన 2.2 లీటర్ బీఎస్​-6 డీజిల్ ఇంజిన్​తో పనిచేస్తుంది కార్నివాల్​. ఇందులో డ్యూయల్ ప్యానెల్​ ఎలక్ట్రిక్ సన్​రూఫ్​, వీఐపీ సీట్ల వెనుక భాగంలో 10.1 అంగుళాల టచ్​స్క్రీన్​తో ఎంటర్​టైన్​మెంట్ సిస్టమ్​, వన్​ టచ్ పవర్ స్లైడింగ్​ డోర్​, స్మార్ట్ పవర్ టెయిల్ గేట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios