మారుతి సుజుకి నుండి కొత్త జిమ్నీని మీరు చూశారా...?
గత కొన్ని నెలలుగా జిమ్మీ పేరు భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. కొత్త మారుతి సుజుకి జిమ్నీ నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా ఇది విక్రయించబడుతుంది.దాని కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన ఆఫ్-రోడ్ పై కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు.
భారతదేశ అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకి తన సత్తాను చాటుకుంటోంది. మారుతి సుజుకి ఎస్‌యూవీ స్థలంలో తన స్థానాన్ని పెంచుకోవాలనుకుంటుంది. ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్ మనకు ఏమి కావాలో చూస్తుండగా కంపెనీ ఆటో ఎక్స్‌పో 2020లో జిమ్మీని భారత్‌కు తీసుకువచ్చింది. కానీ గత కొన్ని నెలలుగా జిమ్మీ పేరు భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఆటో ఎక్స్‌పో 2020లో నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నీని శనివారం ప్రదర్శించింది.
also read ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే !
మారుతి సుజుకి ఇండియా ఎండి & సిఇఒ కెనిచి అయుకావా మాట్లాడుతూ "సుజుకి జిమ్నీ దాని కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన ఆఫ్-రోడ్ పై కూడా సులువుగా ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. నమ్మకమైన, సులభమైన డ్రైవింగ్ కోసం మాస్టర్‌ఫుల్‌గా సుజుకి జిమ్నీని రూపొందించారు. అడ్వెంచర్ రేసర్లకు ఇది ఎంతో ఫేవరెట్ గా ఉంటుంది.
ప్రొఫెషనల్ డ్రైవర్స్ అంచనాలకు, అవసరాలకు రిసెర్చ్ చేసి జిమ్మీని అభివృద్ధి చేశారు. దీని తయారీ ఇంకా ఉత్పత్తి కోసం భారతీయ వినియోగదారుల స్పందనను అంచనా వేయడానికి జిమ్మీని ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించామని మారుతి సుజుకి తెలిపింది.
also read ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...
ఒకవేళ దీని ఉత్పత్తి మొదలైతే మారుతి సుజుకి జిమ్నీని నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 1.5-లీటర్ కె 15 బి పెట్రోల్ ఇంజన్ తో 75 కిలోవాట్ / 6000 ఆర్‌పీఎం పవర్, 130 ఎన్‌ఎమ్ / 4000 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఈ ఇంజన్ సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 లో కూడా ఉపయోగించారు. కొత్త కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ను స్టాండర్డ్ వెర్షన్ గా అందిస్తుంది.
కొన్ని టాప్-ఎండ్ వేరియంట్‌లలో 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్తో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. మారుతి సుజుకి సియాజ్‌లో కూడా ఇలాంటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మీరు చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుజుకి ఎస్‌యూవీ కార్లు ఆల్ గ్రిప్ ప్రో 4x4 సిస్టమ్‌తో వస్తుంది. అయితే ప్రస్తుతం జిమ్ని భారతదేశంలో వస్తుందా లేదా అనే విషయం పై స్పష్టత లేదు. అలాగే భారతదేశంలో మారుతి సుజుకి కంపెనీ జిమ్నీని ఎస్‌హెచ్‌విఎస్ లేదా లైట్ హైబ్రిడ్ సిస్టమ్ స్టాండర్డ్ వర్షన్ గా ప్రవేశపెట్టవచ్చు.సుజుకి జిమ్నీకి మంచి ఆదరణ లభిస్తోందని, 194 దేశాలలో విక్రయిస్తున్నామన్నారు.