ఆటో ఎక్స్‌పో 2020లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే !
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్‌పో 2020లో దేశ, విదేశాల కార్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో త్వరలో బీఎస్-6 నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్-6 ఆధారిత బైక్‌లు, ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఆయా కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి.
టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీ సంస్థల నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్, కియా మోటార్స్ వరకు పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి. కొత్తగా ఆవిష్కరించడం మొదలు తొలిసారి ప్రదర్శించే వరకు, 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రదర్శించిన ఈ వాహనాల్లో ప్రముఖంగా నిలిచిన అయిదుకార్లపై పరిశీలిద్దాం..
గతేడాది జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన విద్యుత్ వాహనం ‘టాటా ఆల్ట్రోజ్-ఈవీ’ ఎట్టకేలకు ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు. అంతేకాదు భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది.
also read ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...
ఈ ఏడాది చివర్లో మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆవిష్కరించనున్న టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారు జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీతో రానుంది, అంటే ఈ కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఫీచర్లపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.
ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ ఆవిష్కరించిన కారు. సిటీ కే-జెడ్‌ఈ . ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విడ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ . చైనాలో జరిగిన 2019 షాంఘై మోటార్ షోలో తొలిసారి ప్రదర్శించిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కే-జెడ్‌ఈ కాన్సెప్ట్‌పై రూపొందించిన రెనాల్ట్ అతి చిన్న ఈవీ అని చెప్పవచ్చు.
క్విడ్ మాదిరిగా, రెనాల్ట్ సిటీ కే-జెడ్‌ఈ కూడా సీఎంఎఫ్ ప్లాట్‌ఫాం ఆధారితమే. అయితే ఎలక్ట్రిక్ మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి అనూహ్యంగా దూసుకు వచ్చిన వాహనం ఈకేయూవీ 100ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ. దీని ధర రూ. 8.25 లక్షలు, ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కొత్త స్టైలింగ్‌తో, కొత్త గ్రిల్ బ్లూ ఎలిమెంట్స్‌తో విడుదలైంది.
ఇది చైనాలోని సాయిక్ గ్రూప్ బ్రాండ్ క్రింద విక్రయించే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీన్ని మోరిస్ గ్యారేజ్ ఇండియా సంస్థ భారతదేశ విపణిలోకి తీసుకువచ్చింది. 2017 షాంఘై ఆటో షోలో ప్రదర్శించిన విజన్ ఈ-కాన్సెప్ట్ ఆధారంగా మార్వెల్ ఎక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతోపాటు హెవీ క్రోమ్ ఎలిమెంట్స్‌ను జోడించుకుని ఎగ్రెసివ్ లుక్‌లో విడుదలైంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, వెనుక ఎల్‌ఈడీ టైలాంప్స్‌తో వస్తుంది.
also read మారుతి సుజుకి కొత్త బిఎస్ 6 ఇగ్నిస్ కార్ లాంచ్
ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో కియా మోటార్స్ తీసుకొచ్చిన వాహనం కియా సోల్ వీవీ. ప్రస్తుతం, దక్షిణ కొరియా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న కియా సోల్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ పాలిమర్ 64 కిలోవాట్ల బ్యాటరీతో 450 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
2025 నాటికి భారత్‌లో 16 ఎలక్ట్రిక్ కార్లను అందించాలని యోచిస్తున్నట్లు కియా ఇంతకుముందే ప్రకటించింది. ఇందులో భాగమే సోల్ ఈవీ. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, ఎల్‌ఈడీ టైల్ లాంప్‌లతోపాటు, హాట్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్-స్టాప్ స్విచ్ ప్రధాన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.